Rules Changes: అలర్ట్.. ఈరోజు నుంచి రూల్స్ మారుతున్నాయి.. తెలుసుకోకుంటే మీ జేబుకు చిల్లు పడ్డట్టే..
అందులో నెల ప్రారంభంలోనే కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్ట్ నెలలోనూ పలు విభాగాల్లో నిబంధనలు మారుతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
ప్రతి నెలా రూల్స్ మారుతున్నాయన్న సంగతి తెలిసిందే. పలు విభాగాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో సామన్యులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. బ్యాంకులు, ఏటీఎం, పీఎం కిసాన్, ఎల్పీజీ సిలిండర్ ధరల వరకు ప్రతి అంశంలోనూ కొత్త నియమాలు నిబంధనలు వస్తుంటాయి. అందులో నెల ప్రారంభంలోనే కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్ట్ నెలలోనూ పలు విభాగాల్లో నిబంధనలు మారుతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
పీఎం కిసాన్ కేవైసీ..
పీఎం కిసాన్ ఈ కేవైసీ అప్డేట్ జూలై 31 లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్ట్ 1 నుంచి రైతులు తమ పీఎం కిసాన్ ఈ కేవైసీని అప్డేట్ చేయలేరు. E-KYC పూర్తిచేయనివారికి పీఎం కిసాన్ 12వ విడత నగదు రాదు. ఇక ఈరోజు నుంచి రైతులు తమ పీఎం కిసాన్ ఈకేవైసీ అప్డేట్ చేయలేరు.
ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్..
2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 విద్యా సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి జూలై 31 చివరితేదీ. ఐటీఆర్ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేసినందుకు ఆగస్ట్ 1 నుంచి జరిమానా కమ్ ఆలస్య రుసుము వసూలు చేయనున్నారు. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే వారు రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే 5 లక్షల కంటే తక్కువగా ఉంటే రూ. 1000 జరిమానా చెల్లించాలి.
చెక్కులకు సంబంధించిన నియమాలు..
బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కులకు సంబంధించిన ముఖ్యమైన నియమం మార్చనుంది. రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం పాజిటివ్ పే సిస్టమ్‌ను అమలు చేస్తుంది. ఇది చెక్కు క్లియర్ అయ్యే ముందు ప్రామాణీకరణ కోసం బ్యాంక్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చెక్కులో ఎస్ఎంఎస్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లబ్దిదారుని పేరు, ఖాతా నంబర్, చెక్ నంబర్ నమోదు చేయాలి. చెల్లింపు ప్రాసెస్ చేస్తున్నప్పుడు సమర్పించిన చెక్‌తో ఈ సమాచారం మొత్తం క్రాస్ చెక్ చేయబడుతుంది. ఆ తర్వాతే చెక్ క్లియర్ అవుతుంది.
పీఎంఎఫ్బీవై రిజిస్ట్రేషన్..
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కోసం రిజిస్ట్రేషన్స్ నిన్నటితో ముగిసాయి. రిజిస్ట్రేషన్స్ కోల్పోయినవారు ఈ ప్లాన్స్ పొందలేరు. రిజిస్ట్రేషన్ ఆఫ్ లైన్ లోనూ చేసుకోవచ్చు.
ఎల్పీజీ సిలిండర్ ధరలు..
ప్రతి నెల 1న ఎల్పీజీ సిలిండర్ ధరలు మారుతుంటాయి. ఆగస్ట్ నెలలో కూడా వీటి ధరలలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు సంస్థలు మార్చే అవకాశం ఉంది. గతంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తక్కింది.. అలాగే దేశీయ గ్యాస్ సిలిండర్ రూ. 50 పెరిగింది.