LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే?
LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు సోమవారం (ఆగస్టు 1) శుభవార్త చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కొంతమేర తగ్గించాయి.
LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు సోమవారం (ఆగస్టు 1) శుభవార్త చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కొంతమేర తగ్గించాయి. రూ.36 మేర తగ్గిస్తున్నట్లు, సోమవారం ఉదయం నుంచే ఈ ధరలను అమలు చేయనున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కాస్తా రూ.36 తగ్గి రూ.1976.50కు చేరుకుంది. గతంలో దీని ధర రూ.2012.50గా ఉండేది. ఇక హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌పై రూ.44.50 మేర తగ్గింది. ప్రస్తుతం నగరంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.2197.50కు లభ్యమవుతోంది.
ఇక కోల్‌కతాలో గతంలో రూ.2,132గా ఉన్న సిలిండర్ ధర రూ.2095.50కు దిగొచ్చింది. ముంబైలో రూ.1972.50గా ఉన్న సిలిండర్ 1936.50 గా మారింది. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తాజా నిర్ణయంతో 19 కిలోల గ్యాస్ సిలిండర్లు ఎక్కువగా వినియోగించే రెస్టారెంట్లు, తినుబండారాలు, టీస్టాల్స్ ఇతర వ్యాపార నిర్వాహకులకు కాస్త ఉపశమనం కలగనుంది.
గ్యాస్ సిలిండర్ ధరను ఇలా చెక్ చేయండి.. LPG సిలిండర్ ధరను చెక్ చేయడానికి, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ IOC వెబ్‌సైట్‌కు వెళ్లాలి. కంపెనీలు ప్రతి నెలా కొత్త రేట్లు విడుదల చేస్తాయి. (https://iocl.com/Products/IndaneGas.aspx) ఈ లింక్ ద్వారా మీరు మీ నగరంలోని గ్యాస్ సిలిండర్‌ల ధరను చెక్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి