Best FD Plans: ఎస్‌బీఐ కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ అదిరింది.. కానీ ఇవి అంతకుమించి.. పూర్తి వివరాలు..

ఈ బ్యాంకు జూలై 15న అమృత్‌ వృష్టి పేరుతో కొత్త టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. దేశీయ, నాన్-రెసిడెంట్ భారతీయ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. 444 రోజుల కాల వ్యవధితో ఈ పథకం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిలో వడ్డీ ఎంత? ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటూనే.. ఈ పథకానికి పోటీగా దేశంలో ఇతర ప్రధాన బ్యాంకులు అందిస్తున్న పథకాల గురించి తెలుసుకుందాం..

Best FD Plans: ఎస్‌బీఐ కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ అదిరింది.. కానీ ఇవి అంతకుమించి.. పూర్తి వివరాలు..
Fixed Deposit
Follow us

|

Updated on: Aug 08, 2024 | 8:16 AM

మన దేశంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. జనాలు వాటిల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతారు. స్థిరమైన వడ్డీ ఉండటం.. అన్ని బ్యాంకులు కూడా పలు రకాల ఆఫర్లతో కూడిన కొత్త డిపాజిట్‌ స్కీమ్‌లను ప్రవేశపెడుతుండటంతో ఎక్కువ శాతం మంది వీటిల్లో పెట్టుబడులుపెడుతున్నారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజెన్స్‌కు ఇవి అధిక ప్రయోజనాలను అందిస్తుండటంతో వారు వీటి వైపు చూస్తున్నారు. అయితే వీటిల్లో వడ్డీ రేటు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండదు. కొన్ని బ్యాంకులు పరిమిత కాల ఆఫర్లతోకూడిన పథకాలను ప్రకటించి, పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ప్రముఖ పబ్లిక్‌ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ముందంజలో ఉంటుంది. ఈ బ్యాంకు జూలై 15న అమృత్‌ వృష్టి పేరుతో కొత్త టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. దేశీయ, నాన్-రెసిడెంట్ భారతీయ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. 444 రోజుల కాల వ్యవధితో ఈ పథకం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిలో వడ్డీ ఎంత? ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటూనే.. ఈ పథకానికి పోటీగా దేశంలో ఇతర ప్రధాన బ్యాంకులైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లలో అందుబాటులో ఉన్న పథకాల గురించి కూడా తెలుసుకుందాం.

ఎస్‌బీఐ అమృత్ వృష్టి.. ఈ పథకం 444 రోజుల కాల వ్యవధితో వస్తుంది. ఇది సాధారణ వినియోగదారులకు అత్యధిక వడ్డీ రేటు 7.25% అందిస్తుంది. సీనియర్ సిటిజన్‌లకు అదే పదవీకాలంలో 7.75% చొప్పున అంటే 50 బీపీఎస్‌లు అదనంగా అందిస్తుంది. ఈ పథకం మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ).. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 400 రోజుల ఎఫ్‌డీలపై 7.25% వడ్డీ రేటును అందిస్తుంది. అదే పదవీకాలానికి సీనియర్ సిటిజన్లు 7.75% వడ్డీ రేటును పొందుతారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎన్‌బీఐ, పీఎన్‌బీ ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటునే అందిస్తోంది. 399 రోజుల పదవీకాలంపై సాధారణ పౌరులకు 7.25% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.75% ఆఫర్ చేస్తోంది.

కెనరా బ్యాంక్.. ఈ బ్యాంక్ తన 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను కస్టమర్లకు అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.25%, సీనియర్ సిటిజన్‌లకు 7.75% ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ).. ఈ బ్యాంకులో 399 రోజుల (బాబ్ మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్) పథకంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులకు 7.25% రేటు, సీనియర్ సిటిజన్‌లకు 7.75% ఆఫర్ చేస్తోంది.

పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్.. ఈ బ్యాంక్‌ కూడా 444 రోజుల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7.25%, సీనియర్ సిటిజన్‌లకు 7.75% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ప్రత్యేక పథకం సెప్టెంబర్ 30, 2024 వరకు అందుబాటులో ఉంటుంది.

కరూర్ వైశ్యా బ్యాంక్.. కరూర్ వైశ్యా బ్యాంక్ 444 రోజుల కాలవ్యవధిపై కస్టమర్‌లకు అందించే వడ్డీ రేట్ల విషయానికి వస్తే ఇతర ప్రధాన బ్యాంకుల కంటే ముందుంది. బ్యాంక్ సాధారణ పౌరులకు 7.50%, సీనియర్ సిటిజన్లకు 8% వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎస్‌బీఐ కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ అదిరింది.. కానీ ఇవి అంతకుమించి..
ఎస్‌బీఐ కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ అదిరింది.. కానీ ఇవి అంతకుమించి..
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్​మెంట్..
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్​మెంట్..
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత.. ఏమిటంటే
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత.. ఏమిటంటే
రాజస్థాన్‌లోని బార్మర్ తెలుసా.? ఇక్కడ టెంపుల్స్ ఒక్కసారైన చూడాలి.
రాజస్థాన్‌లోని బార్మర్ తెలుసా.? ఇక్కడ టెంపుల్స్ ఒక్కసారైన చూడాలి.
మొబైల్ నంబర్ మారకుండా.. నెట్‌వర్క్ మారాలా? ఈ సింపుల్ టిప్స్..
మొబైల్ నంబర్ మారకుండా.. నెట్‌వర్క్ మారాలా? ఈ సింపుల్ టిప్స్..
‘APPSC గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి’
‘APPSC గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి’
గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర..
గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర..
నాగ పంచమి రోజున ఈ పనులు చేస్తే ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..
నాగ పంచమి రోజున ఈ పనులు చేస్తే ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..
టాప్ బ్రాండ్ ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 45శాతం ఆఫర్.. త్వరపడండి..
టాప్ బ్రాండ్ ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 45శాతం ఆఫర్.. త్వరపడండి..
టీజీపీఎస్సీ టీఆర్టీ - 2017 ఫలితాలు విడుదల
టీజీపీఎస్సీ టీఆర్టీ - 2017 ఫలితాలు విడుదల