Indigo Airlines: విమాన ప్రయాణికులకు బంఫర్ ఆఫర్.. ఇండిగో ప్రత్యేక తగ్గింపు ఈ నెలాఖరు వరకే..

దూరప్రాంతాల నుంచి రావడానికి విమాన ప్రయాణం చాలా ఉపయోగంగా ఉంటుంది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో విమాన టిక్కెట్ల బుక్కింగ్ లు కూడా జోరుగా జరుగుతున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికుల కోసం యాడ్ ఆన్స్ ఫియస్టా అనే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Indigo Airlines: విమాన ప్రయాణికులకు బంఫర్ ఆఫర్.. ఇండిగో ప్రత్యేక తగ్గింపు ఈ నెలాఖరు వరకే..
Indigo Airlines
Follow us
Madhu

|

Updated on: Sep 11, 2024 | 7:55 PM

దేశంలో పండగల సందడి మొదలైంది. ఇప్పటికే వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా, దీపావళి కూడా త్వరలో రానున్నాయి. దూర ప్రాంతాలలో స్థిరపడిన వారు తమ సొంతూళ్లకు తిరిగి రానున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో కలిసి పండగలను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. దూరప్రాంతాల నుంచి రావడానికి విమాన ప్రయాణం చాలా ఉపయోగంగా ఉంటుంది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో విమాన టిక్కెట్ల బుక్కింగ్ లు కూడా జోరుగా జరుగుతున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికుల కోసం యాడ్ ఆన్స్ ఫియస్టా అనే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

యాడ్-ఆన్ లపై తగ్గింపు..

పండగల నేపథ్యంలో ఇండిగో సంస్థ యాడ్ ఆన్స్ ఫియస్టా అనే ప్యాకేజీ ప్రకటించింది. దీని ద్వారా ప్రయాణికులు నెల రోజుల పాటు ఎంపిక చేసుకున్న ట్రావెల్ యాడ్ ఆన్‌లపై 20 శాతం తగ్గింపు పొందవచ్చు. పండుగలు, సెలవుల కోసం ఇంటికి వెళ్లే వ్యక్తులతో విమానయాన సంస్థలు సాధారణ రోజుల కంటే రద్దీగా ఉంటాయి. వారికి మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజీని అమలు చేస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ విమానయాన సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్‌లు చేసుకుని ప్రయాణికులు ఈ ఆఫర్లను పొందవచ్చు. అదనపు బ్యాగేజీ, సీటు ఎంపిక, చెక్ ఇన్ లో ప్రాధాన్యత, భోజనం వంటి అనేక సేవలకు వర్తిస్తుంది.

ఇండిగో యాడ్-ఆన్స్ ఫియస్టా..

ఇండిగో ప్రవేశపెట్టిన యాడ్-ఆన్ ఫియస్టా ఆఫర్ ద్వారా విమాన ప్రయాణికులు ఈ కింద సౌకర్యాలు పొందవచ్చు.

సీటు ఎంపిక.. ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంపిక చేసుకోవచ్చు. కిటికీ, అదనపు లెగ్‌రూమ్ తదితర వాటిని తమ అవసరాలను అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సామాన్లు.. ప్రయాణం సాఫీగా జరగడానికి అదనపు లగేజీ భత్యాన్ని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

  • ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ బ్యాగేజీని తీసుకువెళ్లవచ్చు.
  • స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ కోసం హ్యాండ్లింగ్ ఫీజులను ముందుగా చెల్లించే అవకాశం ఉంటుంది.
  • వెయిటింగ్ సమయం తగ్గించడానికి, త్వరిత చెక్-ఇన్, ఫ్లెక్సిబుల్ బోర్డింగ్‌ కు వీలుంటుంది.
  • స్ట్రీమ్‌లైన్డ్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీస్‌లతో పాటు ఇష్టపడే సీటు, భోజనాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
  • స్నాక్ కాంబోతో సీటు ఎంపికను జత చేసుకోవచ్చు.

పండగ డిస్కౌంట్లు..

ఇండిగోతో పాటు విస్తారా, ఎయిర్ ఇండియా తదితర విమానయాన సంస్థలు కూడా ఈ సీజన్లలో పండుగ తగ్గింపులను అందిస్తున్నాయి. విస్తారా ఫ్రీడమ్ సేల్ లో రూ. 1,578 ప్రారంభ శ్రేణి నుంచి వన్-వే డొమెస్టిక్ విమానాలను అందించింది, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టులో రూ.1,037 వరకూ ఆఫర్ చేసింది. కాగా.. పండగల సీజన్ లో విమాన ఛార్జీలు పెరగనున్నాయి. దీపావళికి సగటు వన్-వే టిక్కెట్ ధర 10 నుంచి 15 శాతం ఎక్కువయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!