Home Loans: గృహ రుణం కావాలా? అతి తక్కువ వడ్డీకే అందించే బ్యాంకులు ఇవే.. చెక్ చేసుకోండి..
మీరు ఒకవేళ హోమ్ తీసుకోవాలని భావిస్తే ఈ వడ్డీ రేట్లను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. పలు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ మధ్య వ్యత్యాసాన్ని చూడాలి. ఎందులో తక్కువ వడ్డీ ఉందో అధ్యయనం చేయాలి. అలాగే పలు ప్రయోజనాలు, ప్రాసెసింగ్ చార్జీలు, లేట్ పెనాల్టీలు, ప్రీ క్లోజర్ ఫీజులు వంటి అనేక అంశాల గురించి అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వడ్డీ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ దానిని అందరూ నెరవేర్చుకోలేరు. కానీ అందరూ దాని కోసం తాపత్రయపడతారు. ప్రస్తుత కాలంలో ఇల్లు కట్టడం అనేది చాలా వ్యయంతో కూడుకున్నది అయిపోయింది. బోలెడంత ప్రయాస కూడా దాని వెనుక ఉండాలి. అందుకే పెద్దలు అంటూ ఉంటారు.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. రెండు కార్యక్రమాలు చాలా ప్రధానమైనవి.. పైగా ఖర్చుతో కూడుకున్నవి. ఎంత పెట్టినా ఇంకా కావాలి అని అంటూనే ఉంటాయి. అందుకే ఎవరి పరిస్థితి అనుగుణంగా ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. అందుకోసం అందరూ ఆశ్రయించే ఉత్తమ మార్గం గృహ రుణం. ఇటీవల కాలంలో ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరూ హోమ్ లోన్లు తీసుకుంటున్నారు. బ్యాంకులతో పాటు పలు ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తాయి. అందుకోసం కొంత వడ్డీని అవి వసూలు చేస్తాయి. మీరు ఒకవేళ హోమ్ తీసుకోవాలని భావిస్తే ఈ వడ్డీ రేట్లను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. పలు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ మధ్య వ్యత్యాసాన్ని చూడాలి. ఎందులో తక్కువ వడ్డీ ఉందో అధ్యయనం చేయాలి. అలాగే పలు ప్రయోజనాలు, ప్రాసెసింగ్ చార్జీలు, లేట్ పెనాల్టీలు, ప్రీ క్లోజర్ ఫీజులు వంటి అనేక అంశాల గురించి అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వడ్డీ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఈ నేపథ్యంలో మన దేశంలో హోమ్ లోన్లు అందించే బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ తీసుకునే బ్యాంకుల గురించి తెలుసుకుందాం రండి..
ఎస్బీఐ హోమ్ లోన్ రేట్లు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ బహుళజాతి ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటి. ప్రస్తుతం, ఇది 0.17 శాతం ప్రాసెసింగ్ ఫీజుతో సంవత్సరానికి 8.40 శాతం వడ్డీ రేటుతో తన వినియోగదారులకు గృహ రుణాలను అందిస్తోంది. అయితే ఎస్బీఐ ప్రస్తుతం ప్రత్యేక గృహ రుణ క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. 65 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు రాయితీలను అందిస్తోంది. ఈ రాయితీ సాధారణ గృహ రుణాలు, ఫ్లెక్సీపే, ఎన్ఆర్ఐ, నాన్-శాలరీస్, అపోన్ ఘర్‌లపై వర్తిస్తుంది. ఈ రాయితీకి చివరి తేదీ డిసెంబర్ 31, 2023.
బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ రేట్లు.. బ్యాంక్ ఆఫ్ బరోడా శాలరీ, నాన్ శాలరీ వ్యక్తులకు గృహ రుణాలను అందించే మరో ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది సంవత్సరానికి 8.60 శాతం వడ్డీ రేటుతో లోన్లు అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం(కనిష్టంగా రూ. 8,500, గరిష్టంగా రూ. 25,000) వరకు ఉంటుంది .
రుణం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారు రుణ పరిమితి, వడ్డీ రేట్లు ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ ఆధారంగా ఉంటాయి.
ఇండియన్ బ్యాంక్ హోమ్ లోన్ రేట్లు.. ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ లో గృహ రుణాలకు సంవత్సరానికి 8.50 నుంచి 9.90 శాతం వడ్డీ రేటు విధిస్తుంది. దీనిలో ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 0.23 శాతం. ఇది శాలరీడ్, స్వయం ఉపాధి, ఎన్ఆర్ఐ లకు రుణాలను అందిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్ రేట్లు.. ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు గృహ రుణాలను అందించే ప్రైవేట్ రంగ బ్యాంకు. సిబిల్ స్కోర్ 750-800 ఉన్నవారికి ప్రత్యేక గృహ రుణ వడ్డీ రేటు 9 శాతం. ఇది సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ బ్యాంకులో ప్రామాణిక గృహ రుణ రేటు 9.25 శాతంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








