Electric Bikes: 2023 ఎలక్ట్రిక్ బైక్ నామ సంవత్సరమే! క్యూ కట్టనున్న దిగ్గజ కంపెనీలు.. బెస్ట్ ఆప్షన్లు ఇవే!

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్‌, ఎథర్, యాంపియర్‌ వంటి కంపెనీలు ఈవీల తయారీలో ముందంజలో ఉండగా.. బజాజ్‌, టీవీఎస్‌ కూడా తమ మోడళ్లయిన చాతక్‌, ఐక్యూబ్‌ లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నాయి.

Electric Bikes: 2023 ఎలక్ట్రిక్ బైక్ నామ సంవత్సరమే! క్యూ కట్టనున్న దిగ్గజ కంపెనీలు.. బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Honda First Electric Scooter
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Dec 21, 2022 | 11:55 AM

వచ్చే ఏడాదిలో కొత్త ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల జాతర మొదలుకానుంది. మారుతున్న కాలానుగుణంగా.. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో అందరి చూపు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలపై ఉంది. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా పలు దిగ్గజ కంపెనీలు, స్టార్టప్‌ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ బైక్‌లు, స్కూటర్‌లను అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్‌, ఎథర్, యాంపియర్‌ వంటి కంపెనీలు ఈవీల తయారీలో ముందంజలో ఉండగా.. బజాజ్‌, టీవీఎస్‌ కూడా తమ మోడళ్లయిన చాతక్‌, ఐక్యూబ్‌ లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నాయి.

క్యూ కట్టనున్న దిగ్గజ కంపెనీలు..

2022లో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌లోకి వచ్చాయి. ఓలా ఎస్‌1, ఎథర్‌ 450ఎక్స్‌ జెన్‌3, హీరో విడా వీ1 వంటి మోడళ్లకు మార్కెట్‌లో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరం 2023లో కూడా సుజుకీ, హీరో, టీవీఎస్‌ వంటి కంపెనీలు తమ న్యూ మోడళ్లను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చూసుకుంటున్నాయి. వాటిలో బెస్ట్‌ మోడల్స్‌ కొన్ని ఇప్పుడు పరిశీలిద్దాం..

సుజుకీ బుర్గ్‌మన్‌ స్ట్రీట్‌ ఎలక్ట్రిక్‌.. దేశంలోని ప్రధాన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన సుజుకీ తన ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ బుర్గ్‌మన్‌ స్ట్రీట్‌ స్కూటర్‌ను వచ్చే కొత్త సంవత్సరంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. సంప్రదాయ తరహా ఇంధన ఇంజిన్‌ మాదిరి మోడల్‌ లోనే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఆ కంపెనీ తీసుకొస్తోంది. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌(ఐసీఈ) స్థానంలో 4 కిలోవాట్ల బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీనికి ఒక సారి చార్జింగ్‌ పెడితే దాదాపు 100 కిలోమీటర్లు వస్తుంది.

ఇవి కూడా చదవండి

టీవీఎస్‌ క్రియాన్‌..  ద్విచక్ర వాహనాల తయారీల కంపెనీల్లో మరో దిగ్గజం టీవీఎస్‌ మోటార్స్‌. ఇది కూడా తన రెండో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఒకసారి చార్జ్‌ చేస్తే 80 కిలోమీటర్లు వచ్చేలా దీనిని డిజైన్‌ చేస్తున్నారు. సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని 5.1 సెకన్లలోనే అందుకునే విధంగా రూపొందిస్తున్న ఈ స్కూటర్‌ 2023 సెకండ్‌ హాఫ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌.. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనాల్లో హోండా యాక్టివా ఒకటి. ఇప్పుడు ఇదే బైక్‌ ఎలక్ట్రిక్‌ వేరియంట్లో 6జీ కింద వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిని ఒక్కసారి చార్జ్‌ చేస్తే 95 కిలోమీటర్లు వచ్చే విధంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

సింపుల్‌ వన్‌.. ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహన వినియోగదారులు అధిక శాతం మంది ఎదురుచూస్తున్న వేరియంట్‌ సింపుల్‌ వన్‌. ఇది 2023 తొలి అర్ధభాగంలోనే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకసారి చార్జ్‌ చేస్తే ఏకంగా 236 కిలోమీటర్ల మైలేజ్‌ వస్తుందని, అలాగే గంటలకు 105 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్‌లో దూసుకు పోగలదని చెబుతున్నారు.

యమహా కూడా.. మరో దిగ్గజ కంపెనీ అయిన యమహా కూడా వచ్చే ఏడాదిలోనే తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను దేశ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ బైక్‌టెస్టింగ్‌ దశలో ఉంది.

హీరో ఎలక్ట్రిక్‌ ఏఈ-8.. మొదటి సారి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనాలనుకొనే వారిని టార్గెట్‌ చేస్తూ హీరో కంపెనీ కూడా తన ఏఈ-8 వేరియంట్‌ను 2023లో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది ఒకసారి చార్జ్‌ చేస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని, టాప్‌ స్పీడ్‌ గంటకు 25 కిలో మీటర్లు ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..