Bajaj 110 CC Bike: 110 సీసీలో ఆ ఫీచర్‌తో వచ్చిన తొలి బైక్‌ ఇదే.. ధర చాలా తక్కువ.

ద్విచక్ర వాహనల తయారీలో దేశీయంగా గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ సంస్థ బజాజ్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. బజాజ్‌ ప్లాటినా 110ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. యాంటీ లాంక్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ (ఏబీఎస్‌) వంటి సేఫ్టీ ఫీచర్‌తో వస్తోన్న మొట్ట మొదటి 110 సీసీ బైక్‌ ఇదే కావడం..

Bajaj 110 CC Bike: 110 సీసీలో ఆ ఫీచర్‌తో వచ్చిన తొలి బైక్‌ ఇదే.. ధర చాలా తక్కువ.
Bajaj 110 Cc Bike
Follow us

|

Updated on: Dec 20, 2022 | 4:18 PM

ద్విచక్ర వాహనల తయారీలో దేశీయంగా గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ సంస్థ బజాజ్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. బజాజ్‌ ప్లాటినా 110ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. యాంటీ లాంక్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ (ఏబీఎస్‌) వంటి సేఫ్టీ ఫీచర్‌తో వస్తోన్న మొట్ట మొదటి 110 సీసీ బైక్‌ ఇదే కావడం విశేషం. ఎన్నో రకాల అధునాతన ఫీచర్లతో ఈ బైక్‌ను తీసుకొచ్చారు. సింగిల్‌ ఏబీఎస్‌తో రూపొందించిన ఈ బైక్‌ ఎబానీ బ్లాక్‌, గ్లాస్‌ పీటర్‌ గ్రే, కాక్‌టెయిల్‌ వైన్‌ రెడ్‌, సాఫ్రన్‌ బ్లూ రంగుల్లో లాంచ్‌ చేశారు.

ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే ఈ ప్లాటిన 110 సీసీ బైక్‌ ఢిల్లీ ఎక్స్‌ షో రూమ్‌ ధర రూ. 72,224గా ఉంది. ఈ బైక్‌ గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ట్యాంక్‌ కెసాపిసిటీ విషయానికొస్తే ఇందులో 11 లీటర్ల కెపాసిటీ ట్యాంక్‌, 17 ఇంచెస్‌ అలాయ్‌ వీల్స్‌ను అందించారు. ఇక బైక్‌ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 200 మిల్లీ మీటర్లుగా ఇచ్చారు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఏబీఎస్ ఇండికేటర్, గేర్ ఇండికేటర్, గేర్ గైడెన్స్ వంటి సరికొత్త ఫీచర్లు అందించారు.

బజాబ్‌ మోటర్‌ సైకిల్స్‌ ప్రెసిడెంట్‌ సరాంగ్‌ కనాడె మాట్లాడుతూ.. ‘భారత్‌లో జరగుతోన్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 45 శాతం ద్విచక్ర వాహనాలే. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ బైక్‌లో ఏబీఎస్‌ ఫీచర్‌ను తీసుకొచ్చాము. దీని బ్రేకింగ్ టెక్నాలజీ అత్యంత సురక్షితమైందని’ తెలిపారు. ఇక ఈ బైక్‌ 7000 ఆర్‌పీఎమ్‌ వద్ద 8.6 పీఎస్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఇక ముందు డిస్క్‌ వెనకాల డ్రమ్‌ బ్రేక్‌ను అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..