AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vice President: భారత ఉపరాష్ట్రపతికి వేతనం ఉండదు.. మరి ఆయనకు ఆదాయం ఎలా వస్తుంది? ఆసక్తికర అంశాలు!

Vice-President Salary: పార్లమెంట్‌లో రాజ్యసభ బాధ్యతలను పూర్తిగా చూసుకునే చైర్మన్‌ హోదా ఉంటుంది. అలాంటిది ఉపరాష్ట్రపతి జీత భత్యాలు, భారత ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు, పెన్షన్‌, ఇతర సదుపాయాలు అన్ని ఉంటాయి. ఉపరాష్ట్రపతికి దేశ ప్రధానమంత్రి లాగా ప్రత్యేక వేతనం అంటూ ఉండదు..

Vice President: భారత ఉపరాష్ట్రపతికి వేతనం ఉండదు.. మరి ఆయనకు ఆదాయం ఎలా వస్తుంది? ఆసక్తికర అంశాలు!
Subhash Goud
|

Updated on: Sep 12, 2025 | 5:47 AM

Share

Vice-President Salary: మన దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి. రాజ్యాంగబద్దంగా భారతదేశ రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి. దేశానికి కొత్త ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వచ్చారు . సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ఆయన ఇండియా అలయన్స్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించారు. కానీ దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉపరాష్ట్రపతి సాధారణంగా రెగ్యులర్ జీతం పొందరని మీకు తెలుసా ? ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. ఇది ఎందుకంటే ఉపరాష్ట్రపతి జీతం రాజ్యసభ చైర్మన్ పదవికి నేరుగా ముడిపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 156 కి.మీ ప్రయాణం.. దీన్ని చూస్తేనే కొనేస్తారు!

పార్లమెంట్‌లో రాజ్యసభ బాధ్యతలను పూర్తిగా చూసుకునే చైర్మన్‌ హోదా ఉంటుంది. అలాంటిది ఉపరాష్ట్రపతి జీత భత్యాలు, భారత ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు, పెన్షన్‌, ఇతర సదుపాయాలు అన్ని ఉంటాయి. ఉపరాష్ట్రపతికి దేశ ప్రధానమంత్రి లాగా ప్రత్యేక వేతనం అంటూ ఉండదు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన పొందే జీతం నెలకు దాదాపు రూ. 4 లక్షలు. ఈ జీతం పార్లమెంట్ చట్టం, పార్లమెంటేరియన్ల జీతాలు, భత్యాల చట్టం, 1953 ప్రకారం నిర్ణయించింది. ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేక జీత నిబంధన లేదు. అందుకే ఆయన కార్యనిర్వాహక ఛైర్మన్‌గా తన వేతనంపై ఆధారపడి ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఉపరాష్ట్రపతికి ఈ సౌకర్యాలు లభిస్తాయి​: ​ వేతనం అందుకోకపోయినా ఉపరాష్ట్రపతికి అనేక ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. ఢిల్లీలోని లుటియెన్స్ జోన్‌లో ఉన్న విలాసవంతమైన ప్రభుత్వ నివాసాన్ని ఆయనకు ఉచితంగా అందిస్తారు . ఈ నివాసానికి ఎలాంటి అద్దె ఉండదు. దీనితో పాటు ఉపరాష్ట్రపతికి రోజువారీ భత్యం, ప్రయాణ భత్యం, మెరుగైన వైద్య సౌకర్యాలు, అనేక ఇతర భత్యాలు కూడా లభిస్తాయి.​

ఇది కూడా చదవండి: T Shirt: అందరికి టీ-షర్ట్‌ అంటే ఇష్టమే.. కానీ ‘టీ’ అంటే ఏమిటో తెలుసా?

భద్రత పరంగా, వారికి SPG ( స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ), Z + సెక్యూరిటీ కవర్‌తో సహా అత్యున్నత స్థాయి భద్రత లభిస్తుంది. ఆయన సిబ్బంది కూడా పెద్దగానే ఉంటుంది. వ్యక్తిగత కార్యదర్శులు , అధికారులు, భద్రతా సిబ్బందితో సహా వారికి స్వతంత్ర ఉపాధ్యక్ష కార్యాలయం ఉంటుంది. దీనిలో అన్ని పరిపాలనా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దేశీయ, విదేశీ పర్యటనల ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. విదేశీ పర్యటనలపై వారికి ఉన్నత స్థాయి గౌరవం, ప్రోటోకాల్ కూడా ఉంటుంది.

పదవిని విడిచిపెట్టిన తర్వాత కూడా మాజీ ఉపరాష్ట్రపతికి ప్రభుత్వం అనేక సౌకర్యాలను అందిస్తుంది. వీటిలో జీవితకాల పెన్షన్ కూడా ఉంటుంది. ఇది ఆయన ప్రస్తుత జీతంలో 50 శాతం. అదనంగా ఆయన టైప్ -8 బంగ్లా , పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్, సెక్యూరిటీ, డాక్టర్, ఇతర సిబ్బంది సేవలను పొందుతూనే ఉంటారు. దీనితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి మరణం తరువాత ఆయన భార్యకు టైప్ -7 బంగ్లా, కొన్ని ఇతర సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం.

ఉపరాష్ట్రపతికి శాలరీస్‌ అండ్‌ అలవెన్సెస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ ఆఫీసర్స్‌ యాక్ట్‌ 1953 ప్రకారం.. జీతభత్యాలను చెల్లిస్తారు. ఎందుకంటే.. రాజ్యసభకు ఆ వ్యక్తి చైర్మన్‌(ఎక్స్‌ అఫీషియో)గా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి. అందుకే స్పీకర్‌లాగే ఉపరాష్ట్రపతికి వేతనం, ఇతర బెనిఫిట్లు అందుతాయి.

ఇది కూడా చదవండి: Viral Video: వేదికపై పాట పడుతుండగా ఏం జరిగిందో చూడండి.. క్షణాల్లోనే జరిగిపోయింది.. షాకింగ్‌ వీడియో

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి