Best Mileage Bike: అందరి హృదయాలు గెలుచుకున్న బైక్.. మైండ్ బ్లోయింగ్ మైలేజీ బ్రో.. లీటర్‌కు 70 కి.మీ.. బడ్జెట్ ధరల్లోనే..
Best Mileage Bike: ఈ బైక్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఎన్నో ఏళ్లుగా అందరికి సుపరిచితమే. ఒకప్పటి నుంచి ప్రతి ఒక్కరు వాడిన బైక్. ఇప్పుడున్న జనరేషన్‌లో రకరకాల బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయినా ఈ బైక్ అందరి హృదయాలను గెలుచుకుంది. ఇప్పటికి చాలా మంది వాడుతున్నారు. ఎందుకంటే మైలేజీలో రికార్డ్ సంపాదించుకుంది..

Best Mileage Bike: ఈ బైక్ గురించి అందరికి పరిచయం అక్కర్లేదు. భారతదేశంలోని ప్రతి ఒక్కరి హృదయాలు గెలుచుకున్న బైక్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఈ బైక్ అందరికి సుపరిచితమేనని చెప్పవచ్చు. భారత మార్కెట్లో కమ్యూటర్ బైక్‌లకు భారీ కస్టమర్ బేస్ ఉంది. తక్కువ ధర, అధిక మైలేజ్ వంటి కారణాల వల్ల కమ్యూటర్ బైక్‌లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి హీరో HF డీలక్స్.
హీరో HF డీలక్స్ బైక్ 97.2 cc ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 Kw గరిష్ట పవర్‌ని, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చారు. ఈ ఇంజిన్ లీటరుకు 68 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. హీరో మోటోకార్ప్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా ఇది ARAI మైలేజ్. అత్యధిక మైలేజీని అందించే బైక్‌లలో ఒకటి అయినప్పటికీ, సుమారు 70 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని చెబుతుంటారు. ఏది ఏమైనప్పటికీ అనుకున్నదానికంటే రాకున్న 68 కి.మీ రావడం పక్కగా ఉంటుందని చెప్పవచ్చు. హీరో HF డీలక్స్ బైక్ ధర తక్కువగా ఉంది.
హీరో HF డీలక్స్ బైక్ ప్రస్తుతం మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఆల్ బ్లాక్ OBD2P వేరియంట్ ధర కేవలం రూ.60,738 కాగా, కిక్ కాస్ట్ OBD2P వేరియంట్ ధర రూ.64,860. మరోవైపు సెల్ఫ్ కాస్ట్ OBD2P వేరియంట్ ధర రూ.70,508. అదే సమయంలో i3S కాస్ట్ OBD2P వేరియంట్ ధర రూ.72,008. అదే సమయంలో టాప్ వేరియంట్ అయిన ప్రో వేరియంట్ ధర రూ.74,290. ఇవన్నీ ప్రస్తుతం హీరో మోటోకార్ప్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎక్స్-షోరూమ్ ధర.

ఇది కూడా చదవండి: Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 156 కి.మీ ప్రయాణం.. దీన్ని చూస్తేనే కొనేస్తారు!
కానీ సెప్టెంబర్ 22 తర్వాత హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర తగ్గుతుంది. ఇతర వెబ్‌సైట్ల ప్రారం.. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర గరిష్టంగా రూ.5,805 వరకు తగ్గుతుంది. జీఎస్టీ తగ్గించినందున సెప్టెంబర్ 22 తర్వాత కస్టమర్లకు ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
కానీ గరిష్ట ధర తగ్గింపు రూ.5,805. వేరియంట్లను బట్టి ధర తగ్గింపు మారే అవకాశం ఉంది. అందుకే మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని హీరో మోటోకార్ప్ అధీకృత డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది. ఒక వైపు మంచి మైలేజీని అందించే బైక్‌లలో ఇది కూడా ఒకటి. మరోవైపు జీఎస్టీ తగ్గడంతో ధర మరింత తగ్గే అవకాశం ఉన్నందున భారత మార్కెట్లో రాబోయే నెలల్లో హీరో HF డీలక్స్ బైక్ అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారతదేశంలో దీపావళి పండుగ సీజన్ సమీపిస్తోంది.
ఇది కూడా చదవండి: T Shirt: అందరికి టీ-షర్ట్ అంటే ఇష్టమే.. కానీ ‘టీ’ అంటే ఏమిటో తెలుసా?
ఈ సమయంలో డీలర్‌షిప్‌లు కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. GST పన్ను తగ్గింపు, దీపావళి ఆఫర్‌ల కలయిక రాబోయే పండుగ సీజన్‌లో కొత్త వాహన కొనుగోలుదారులను ఆనందంతో ముంచెత్తుతుంది.
Home Remedy: మీ వాష్ బేసిన్ మురికిగా మారిందా..? ఈ వంటింటి చిట్కాలతో తళతళ మెరిసిపోతుంది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




