Post Office MIS Scheme: నెలవారీ ఆదాయానికి ఆ పోస్టాఫీస్ పథకమే సూపర్..పైగా ప్రభుత్వ భరోసా
నెలవారీ ఆదాయం కోరుకునే వారికి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పథకం ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా పెరిగిన నెలవారీ ఖర్చులు, అవసరాల నేపథ్యంలో మళ్లీ ఎక్కువ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. తపాల శాఖ కూడా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి నెలా కరెక్ట్‌గా వడ్డీను అందజేస్తుంది.
సాధారణంగా భారతదేశంలో తపాలా శాఖపై ఉండే నమ్మకమే వేరు. ప్రతి చిన్న గ్రామంలో కూడా పోస్టాఫీసు సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ అంతగా వృద్ధి చెందని రోజుల్లోనే పోస్టాఫీసులు జనాదరణను పొందాయి. ఎందుకంటే పోస్టాఫీసుల్లో పెట్టుబడి మంచి రాబడిని ఇస్తాయి. బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే వివిధ పథకాల ద్వారా అధిక వడ్డీని పెట్టుబడిదారులకు అందిస్తాయి. అయితే నెలవారీ ఆదాయం కోరుకునే వారికి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పథకం ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా పెరిగిన నెలవారీ ఖర్చులు, అవసరాల నేపథ్యంలో మళ్లీ ఎక్కువ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. తపాల శాఖ కూడా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి నెలా కరెక్ట్‌గా వడ్డీను అందజేస్తుంది. కాబట్టి ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
వడ్డీ రేటు, రాబడి ఇలా
ప్రస్తుతం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై ప్రతి నెలా వడ్డీను అకౌంట్‌లో వేస్తారు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.40 శాతం వడ్డీను అందిస్తున్నారు. ఈ పథకంలో ఐదేళ్లపాటు రూ.15,00,000 డిపాజిట్ చేస్తే నెలకు రూ.9250 వడ్డీ రూపంలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. అంటే మీరు డిపాజిట్ చేసిన కాలానికి రూ.5,50,000 వడ్డీ కింద పొందవచ్చు.
అధిక వడ్డీ పొందేందుకు చిట్కాలు
చాలా సందర్భాల్లో రిస్క్ లేని పెట్టుబడి ఎంపికగా పోస్టాఫీసు పథకాలు మొదటి స్థానంలో నిలుస్తాయి. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో జమయ్యే వడ్డీ ప్రతి నెలా విత్‌డ్రా చేసుకోవాలనే నిబంధన లేదు. కాబట్టి ఆ వడ్డీలో కొంత భాగాన్ని ప్రతి నెలా ఆర్‌డీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆర్‌డీ పథకం కూడా ఐదేళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల మీరు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ సొమ్ము విత్‌డ్రా చేసుకునే సమయానికి ఇది కూడా మెచ్యూర్ అవుతుంది. ఆర్‌డీపై ప్రస్తుతం 6.1 శాతం వడ్డీ వస్తుంది.
పోస్టాఫీస్ నెలవారీ పథకం అర్హత
భారతదేశంలో ఏ పోస్టాఫీసులోనైనా ఎంఐసీ పథకం కింద ఖాతా తెరవవచ్చు. అలాగే ప్రత్యేక సీఐఎఫ్ నెంబర్‌తో పోస్టాఫీసులో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కూడా తెరవాలి. ఈ ఖాతాలో ప్రతి నెలా వడ్డీ జమవుతుంది. 10 సంవత్సరాలు పైబడిన వారేవరైనా ఈ ఖాతా తెరవచ్చు. అయితే మైనర్లు మాత్రం సంరక్షకుడి సాయంతో ఖాతా తెరవచ్చు. ఆధార్ కార్డు సాయంతో చాలా ఈజీగా ఖాతా తెరవచ్చు.
ఎంఐఎస్ వడ్డీ రేటు
పోస్టాఫీసు ఎంఐఎస్ స్కీమ్‌పై ప్రస్తుతం వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. అయితే డిసెంబర్ 31, 2023 లోపు ఖాతా తెరిచిన వారికే ఈ తాజా వడ్డీ రేటు వర్తిస్తుంది.
గరిష్ట పరిమితి
ఈ ఖాతా ద్వారా సొమ్ము డిపాజిట్ చేయలంటే వ్యక్తిగత ఖాతాదారుడికి రూ.9,00,000 పరిమితి ఉంటుంది. అయితే జాయింట్ ఖాతా ద్వారా అయితే రూ.15,00,000 వరకూ డిపాజిట్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..