Financial Apps: ఆ యాప్స్‌తో డబ్బు లావాదేవీలు సులభతరం.. కానీ ఆ జాగ్రత్తలు తప్పనిసరి

2016లో నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఐ సేవలు బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మారపులు తీసుకొచ్చాయి. క్షణాల్లో వేరే వారి ఖాతాలకు డబ్బు బదిలీ చేయడం సులభం అవుతుంది. ముఖ్యంగా చిల్లర సమస్యకు ఆన్‌లైన్‌ లావాదేవీలు చెక్‌ పెట్టాయి. ప్రతి ఒక్కషాప్‌లో క్యూఆర్‌ స్కానర్‌ ద్వారా యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. అయితే మోసగాళ్లకు ఇదే ప్రధాన ఆయుధంగా మారతుంది. ముఖ్యంగా మనల్ని టార్గెట్‌ చేస్తూ మన సొమ్మును తస్కరించేందుకు స్కామర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

Financial Apps: ఆ యాప్స్‌తో డబ్బు లావాదేవీలు సులభతరం.. కానీ ఆ జాగ్రత్తలు తప్పనిసరి
Financial Apps
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 7:40 AM

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్‌ అనేది తప్పనిసరి వస్తువుగా మారింది. బ్యాంకింగ్‌ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ యాప్స్‌ డబ్బు బదిలీ అనేది చాలా సులభం అయ్యింది. ముఖ్యంగా 2016లో నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఐ సేవలు బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మారపులు తీసుకొచ్చాయి. క్షణాల్లో వేరే వారి ఖాతాలకు డబ్బు బదిలీ చేయడం సులభం అవుతుంది. ముఖ్యంగా చిల్లర సమస్యకు ఆన్‌లైన్‌ లావాదేవీలు చెక్‌ పెట్టాయి. ప్రతి ఒక్కషాప్‌లో క్యూఆర్‌ స్కానర్‌ ద్వారా యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. అయితే మోసగాళ్లకు ఇదే ప్రధాన ఆయుధంగా మారతుంది. ముఖ్యంగా మనల్ని టార్గెట్‌ చేస్తూ మన సొమ్మును తస్కరించేందుకు స్కామర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అందరూ వాడే ఆర్థిక యాప్స్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓసారి తెలుసుకుందాం. 

యాప్ ప్రామాణికత

ఏదైనా ఆర్థిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు దానిపై కొంత పరిశోధన చేయాలి. వినియోగదారు సమీక్షలు, రేటింగ్‌లు, డెవలపర్ రేటింగ్‌ను తనిఖీ చేయాలి. ప్రసిద్ధ ఆర్థిక సంస్థల నుంచి బాగా తెలిసిన, విశ్వసనీయ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయడం మంచిది. చాలా మొబైల్ యాప్‌లు మీ పరికరానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని కోరుతున్నప్పటికీ, ఈ సమాచారం దుర్వినియోగం చేసే కంపెనీలకు వెళ్లకూడదు. కాబట్టి జాగ్రత్తలు చాలా అవసరం.

డౌన్‌లోడ్‌ జాగ్రత్తలు

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా ఐఓఎస్‌ యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఉన్న యాప్స్‌ మాత్రమే డౌన్‌లోడ్‌ చేయాలి. థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లు లేదా సైడ్‌లోడింగ్ యాప్‌లను నివారించంచాలి. అలాగే ఆర్థిక సంస్థ లేదా సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో సూచించే యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇంకా మంచిది. 

ఇవి కూడా చదవండి

గోప్యతా విధానాలు

మీ డేటా ఎలా సేకరిస్తారు? ఎలా ఉపయోగిస్తారు? ఎలా భాగస్వామ్యం చేస్తారు? వంటి విషయాలను అర్థం చేసుకోవడానికి యాప్ గోప్యతా విధానాన్ని జాగ్రత్తగా చదవాలి. ముఖ్యంగా యాప్‌ నిర్వహకులు భారతీయ డేటా రక్షణ నిబంధనలకు లోబడి ఉన్నారని నిర్ధారించుకోవాలి.

బలమైన పాస్‌వర్డ్‌లు

మీ ఆర్థిక యాప్‌ల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను రూపొందించాలి. పుట్టిన తేదీలు లేదా సాధారణ పదాలు వంటి సులభంగా ఊహించగలిగే సమాచారాన్ని ఉపయోగించడం మానుకోవడం మంచిది. 

అనుమతుల ధృవీకరణ

మీరు ఆర్థిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతా వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని అందించమని మిమ్మల్ని అడగవచ్చు. యాప్ ఫీచర్‌లను ఉపయోగించడానికి అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి. 

పాస్‌వర్డ్‌ 

ముఖ్యంగా మీ ఫోన్‌ను పిన్‌, పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ఉంచుకోవడం ఉత్తమం. తాజా భద్రతా ప్యాచ్‌లతో మీ పరికరానికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లను తాజాగా ఉంచడం మంచిది.

సురక్షిత నెట్‌వర్క్‌లు

పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లలో ఆర్థిక లావాదేవీలను నిర్వహించకపోవడం ఉత్తమం. ఎందుకంటే అవి తక్కువ సురక్షితంగా ఉంటాయి. విశ్వసనీయ, సురక్షితమైన నెట్‌వర్క్‌ని ఉపయోగించాలి. తరచుగా పబ్లిక్ నెట్‌వర్క్‌లు మీ ఫోన్ డేటా దొంగిలించడానికి లేదా దుర్వినియోగానికి దారితీయవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేేయండి