Bank Of Baroda Account: కస్టమర్లను ఆకట్టుకోవడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నయా స్కెచ్.. లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ ఖాతా ప్రకటన
ప్రభుత్వ రంగ రుణదాత బీఓబీ లైట్ సేవింగ్స్ ఖాతాను జీవితకాల జీరో బ్యాలెన్స్ సౌకర్యంతో పరిచయం చేసింది. ఈ ఖాతా ద్వారా ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే అన్ని బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. అలాగే ఈ ఖాతా ద్వారా వినియోగదారులు ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్‌ని కూడా ఎంచుకోవచ్చు. అయితే ఖాతాలో నామమాత్రపు త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (క్యూఏబీ)ని నిర్వహించడం చాలా ముఖ్యం. అర్హత కలిగిన ఖాతాదారులు జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డ్‌ను కూడా పొందవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ పండుగ సీజన్‌లో కొత్త జీవితకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. బీఓబీ కే సంగ్ త్యోహార్ కి ఉమంగ్ ప్రచారంలో భాగంగా ప్రభుత్వ రంగ రుణదాత బీఓబీ లైట్ సేవింగ్స్ ఖాతాను జీవితకాల జీరో బ్యాలెన్స్ సౌకర్యంతో పరిచయం చేసింది. ఈ ఖాతా ద్వారా ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే అన్ని బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. అలాగే ఈ ఖాతా ద్వారా వినియోగదారులు ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్‌ని కూడా ఎంచుకోవచ్చు. అయితే ఖాతాలో నామమాత్రపు త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (క్యూఏబీ)ని నిర్వహించడం చాలా ముఖ్యం. అర్హత కలిగిన ఖాతాదారులు జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డ్‌ను కూడా పొందవచ్చు. ఈ ఖాతా గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
బీఓబీ లైట్ సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలు
- జీవితకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా
- మైనర్‌లతో సహా (10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) ఏ నివాస వ్యక్తి అయినా తెరవవచ్చు.
- నామమాత్రపు త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (క్యూఏబీ) అవసరాలతో జీవితకాల ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్
- మెట్రో/అర్బన్ బ్రాంచ్ కోసం రూ. 3,000
- సెమీ-అర్బన్ బ్రాంచ్ కోసం: రూ. 2,000
- రూరల్ బ్రాంచ్ కోసం: రూ. 1,000
- బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లు మరియు తగ్గింపులు.
పండుగ సీజన్ ఆఫర్లు ఇవే
పండుగ సీజన్‌లో బీఓబీ లైట్ సేవింగ్స్ ఖాతా కూడా వివిధ ఆఫర్‌లతో వస్తుంది. పండుగ ప్రచారం కింద బ్యాంక్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, ఫుడ్, ఫ్యాషన్, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్, కిరాణా, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ వంటి విభాగాల్లో ప్రముఖ వినియోగదారు బ్రాండ్‌లతో జతకట్టింది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్‌మైట్రిప్, అమెజాన్, బుక్‌మైషో, మింత్రా, స్విగ్గీ, జొమాటో వంటి బ్రాండ్‌ల నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ హోల్డర్‌లు ప్రత్యేక ఆఫర్‌లు, తగ్గింపులను పొందవచ్చు. ఈ పండుగ ప్రచార ఆఫర్లు డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుంది.
బీఓబీ లైట్ సేవింగ్స్ ఖాతా కోసం అవసరమైన పత్రాలు
- ఫోటోతో డ్రైవింగ్ లైసెన్స్
- పాస్‌పోర్ట్ ఓటరు గుర్తింపు కార్డు
- ఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్
- మున్సిపల్ లేదా ఆస్తి పన్ను రసీదు
- యుటిలిటీ బిల్లులు
- లబ్ధిదారుని పేరు, చిరునామాను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా లేఖ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..