FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకు ఇదే.. మిస్ అయితే చాన్స్ మళ్లీ రాకపోవచ్చు..

బ్యాంకుల మధ్య పోటీ వాతావరణం ఏర్పడుతోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు  బ్యాంకులు తమ పథకాలపై పోటా పోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెంచడం.. ఇతర ప్రయోజనాలతో ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో పలు టెర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లను సవరించింది. దేశంలోని అన్ని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల అన్నింటికంటే అధికంగా దీనిలో వడ్డీ రేటు అందిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకు ఇదే.. మిస్ అయితే చాన్స్ మళ్లీ రాకపోవచ్చు..
Cash
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2023 | 9:47 PM

బ్యాంకుల మధ్య పోటీ వాతావరణం ఏర్పడుతోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు  బ్యాంకులు తమ పథకాలపై పోటా పోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెంచడం.. ఇతర ప్రయోజనాలతో ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో పలు టెర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లను సవరించింది. దేశంలోని అన్ని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల అన్నింటికంటే అధికంగా దీనిలో వడ్డీ రేటు అందిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ వంటి డొమెస్టిక్ రిటైల్ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. మూడేళ్ల కాల పరిమితితో కూడిన వివిధ రకాల పథకాలపై 50 బేసిస్ పాయింట్లను పెంచింది. రూ. 2కోట్ల లోపు పెట్టుబడులపై అక్టోబర్ 9 నుంచి ఈ కొత్త రేట్లు అమలులో ఉంటాయని బ్యాంక్ పేర్కొంది. కాగా బ్యాంకు సాధారణ ప్రజలకు 7.40శాతం వార్షిక వడ్డీని అందిస్తుండగా.. 7.90శాతం సీనియర్ సిటీజెన్స్ కు అందిస్తోంది. అంటే సీనియర్ సిటిజెన్స్ కు 0.50శాతం అధికంగా వార్షిక వడ్డీని అందిస్తోంది. అంతేకాక నాన్ కాలబుల్ డిపాజిట్లపై 0.15శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అంతేకాక బ్యాంక్ 399 రోజుల కాలపరిమితితో ఉండే తన తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేట్లను మార్చింది. సీనియర్ సిటిజన్లు స్కీమ్ కింద నాన్ కాలబుల్ డిపాజిట్లపై 7.80% వార్షిక వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్‌లకు అందించే ఈ వడ్డీ రేటు ఎస్బీఐతో సహా దేశంలోని అనేక ఇతర ప్రముఖ బ్యాంకులు కంటే మెరుగ్గా ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్ రిటైల్ లియబిలిటీస్ అండ్ ఎన్ఆర్ఐ బిజినెస్ రవీంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ కస్టమర్‌లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. దీంతో వారు అధిక హామీతో కూడిన రాబడిని పొందగలుగుతారని వివరించారు. 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధిలో, సీనియర్ సిటిజన్ డిపాజిటర్లు ఇప్పుడు 7.90% వార్షిక వడ్డీని పొందగలుగుతారని చెప్పారు. ఇది పరిశ్రమలో అత్యుత్తమమైనదిగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఖాతాలు ఉన్నవారు అలాగే కొత్త కస్టమర్‌లు భారతదేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో కొత్త డిపాజిట్‌లను ఉంచడానికి, వారి డిపాజిట్‌లపై అధిక వడ్డీ రేటును పొందడానికి ఇది సరైన సమయం అని నేగి చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఫెస్టివల్ ఆఫర్స్..

బ్యాంక్ ఆఫ్ బరోడా తన పండుగ క్యాంపెయిన్ ను “బీఓబీ కే సంగ్ త్యోహార్ కి ఉమంగ్” ను ప్రారంభించింది. బీఓబీ లైట్ సేవింగ్స్ ఖాతా, బీఓబీ బీఆరఓ సేవింగ్స్ ఖాతా, మై ఫ్యామిలీ మై బ్యాంక్/బీఓబీ పరివార్ ఖాతా, బరోడా ఎన్ఆర్ఐ పవర్‌ప్యాక్ వంటి వినూత్న పథకాలతో పాటు బీఓబీ ఎస్డీపీ(సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్) వంటి వివిధ రకాల కస్టమర్ విభాగాలకు ప్రయోజనాల పరిధిని అందిస్తుంది. ఈ పండుగ క్యాంపెయిన్ 31 డిసెంబర్ 2023 వరకు కొనసాగుతుంది. బ్యాంక్ కస్టమర్ల నుంచి ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనను చూస్తోంది. పై పథకాలతో పాటు, కస్టమర్లు ఇప్పుడు తమ డిపాజిట్లపై అధిక వడ్డీని పొందవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంతకు ముందు మే 2023, మార్చి 2023లో రిటైల్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రస్తుత ఖాతాదారులతో పాటు కొత్త కస్టమర్‌లు ఈ ఆఫర్‌ను పొందేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచ్ లలో ఏదైనా ఒక కొత్త ఎఫ్డీని తెరవవచ్చు. బ్యాంక్ మొబైల్ యాప్ (బీఓబీ వరల్డ్)/ నెట్ బ్యాంకింగ్ (బీఓబీ వరల్డ్ ఇంటర్నెట్) ద్వారా ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు ఆన్‌లైన్ ఎఫ్ డీని కూడా తెరవవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!