BOB Loans: లోన్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు.. జీరో ప్రాసెసింగ్ ఫీజు.. పైగా అతి తక్కువ వడ్డీ రేటు..
మన దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) ఓ కొత్త క్యాంపెయిన్ ను ప్రారంభించింది. బీఓబీకే సంగ్ త్యోహర్ కి ఉమంగ్ పేరుతో కొత్త స్కీమ్ ను ప్రకటించింది. దీనిలో భాగంగా గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత, వ విద్య వంటి రుణాలను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు 2023 డిసెంబర్ 31 వరకూ అమలులో ఉంటాయని బ్యాంకు పేర్కొంది.

దేశంలో పండుగ సీజన్ ప్రారంభం అయ్యింది. వినాయక చవితి, దసరా, దీపావళి సమీపించడంతో అన్ని రంగాల్లోనూ ఆఫర్ల జోరు ప్రారంభమైంది. బ్యాంకింగ్ లో పలు ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే పలు కొత్త స్కీమ్లను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో మన దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) ఓ కొత్త క్యాంపెయిన్ ను ప్రారంభించింది. బీఓబీకే సంగ్ త్యోహర్ కి ఉమంగ్ పేరుతో కొత్త స్కీమ్ ను ప్రకటించింది. దీనిలో భాగంగా గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత, వ విద్య వంటి రుణాలను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు 2023 డిసెంబర్ 31 వరకూ అమలులో ఉంటాయని బ్యాంకు పేర్కొంది. అలాగే కొత్త బ్యాంకు ఖాతాలను కూడా ప్రారంభించింది. పండుగ సీజన్‌కు ముందు తమ డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు పండుగ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను అందించడానికి టాప్ ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, ఫుడ్ బ్రాండ్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ లోన్లపై అందిస్తున్న తాజా రుణ వడ్డీ రేట్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణాలు.. పండుగ కాలపు ఆఫర్ సమయంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా సంవత్సరానికి 8.40 శాతం నుంచి గృహ రుణాలను అందజేస్తుంది. హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజులను కూడా బ్యాంక్ మాఫీ చేస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కార్ లోన్లు.. బీఓపీ కే సంగ్ త్యోహార్ కి ఉమంగ్ క్యాంపెయిన్ సందర్భంగా, బ్యాంక్ జీరో ప్రాసెసింగ్ రుసుముతో సంవత్సరానికి 8.70 శాతం నుంచి కార్ లోన్‌లను అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎడ్యుకేషన్ లోన్.. సంవత్సరానికి 8.55 శాతం నుంచి ప్రారంభమయ్యే విద్యా రుణాల కోసం ప్రత్యేక రేటును ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ తెలిపింది. ఇది 60 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపును అందిస్తుంది. అదనపు ప్రయోజనం ఏమిటంటే, విద్యార్థులు దేశంలో గుర్తించబడిన ప్రముఖ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన తర్వాత ఎటువంటి పూచీకత్తును అందించనవసరం లేదు.
బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యక్తిగత రుణాలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 10.10 శాతం వడ్డీ నుంచి అందిస్తుంది. 80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో గరిష్టంగా రూ. 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తోంది.
ఇది గుర్తుంచుకోండి.. పర్సనల్, కార్ లోన్ సెగ్మెంట్లో ఫిక్స్‌డ్ రేట్ వడ్డీ ఆప్షన్‌ను ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ తెలియజేసింది. రుణగ్రహీతలు ఇప్పుడు స్థిర, ఫ్లోటింగ్ వడ్డీ రేటు మధ్య ఎంచుకోవచ్చు. ముఖ్యంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీ రోజువారీ తగ్గింపు బ్యాలెన్స్ పద్ధతిలో లెక్కించబడుతుంది. మంత్లీ రిడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతిలో కాదు, ఇది రుణగ్రహీతలకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్ కోసం వివిధ నగరాల్లో 112 రిటైల్ అసెట్ ప్రాసెసింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త సేవింగ్స్ ఖాతాలు
- బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్- జీవితకాలం పాటు కనీస బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.
- బీఓపీ బీఆర్ఓ సేవింగ్స్ ఖాతా- 16 నుండి 25 సంవత్సరాల మధ్య విద్యార్థుల కోసం జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా ఇది.
- మై ఫ్యామిలీ మై బ్యాంక్/బీఓబీ పరివార్ ఖాతా – మొత్తం కుటుంబం అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన కుటుంబ పొదుపు ఖాతా ఇది
- బరోడా ఎన్ఆర్ఐ పవర్‌ప్యాక్ ఖాతా – ఇది ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించినది.
రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అయిన బీఓబీ, ఎస్డీపీ (సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్)ని కూడా ప్రారంభించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ సందర్బంగా బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ దేబదత్తా చంద్ మాట్లాడుతూ పండుగ సీజన్లో కార్ల అమ్మాకాలలో ఇప్పటికే వృద్ధి కనిపిస్తోంది. బీఓబీ కే సంగ్ త్యోహర్ కి ఉమంగ్ క్యాంపెయిన్ లో భాగంగా పొదుపు ఖాతాలు, లోన్‌లు, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లలో ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తున్నట్లు ప్రకటించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







