LIC Policy: రోజుకి రూ. 171 చొప్పున చెల్లించండి.. ఒకేసారి రూ. 28లక్షలు పొందండి.. పిల్లల కోసం ఎల్ఐసీ బెస్ట్ ప్లాన్..
పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఆరాట పడే తల్లిదండ్రుల కోసం బెస్ట్ ప్లాన్ ను మీకు పరిచయం చేయబోతున్నాం. దాని పేరు ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్. దీనిలో పెట్టే పెట్టుబడిపై బీమా కవరేజీతో పాటు మనీ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. అతి తక్కువ ప్రీమియంతో అధిక రాబడిని మెచ్యూరిటీ సమయంలో పొందే ఈ ఎల్ఐసీ జీవన్ తరుణ పాలసీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
లైఫ్ ఇన్సురెన్స్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటేనే జనాలకు పెద్ద భరోసా. దానిలో అధిక భద్రత ఉంటుందని అందరూ విశ్వసిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ కావడం, మంచి పాలసీలు అందుబాటులో ఉండటం, సెటిల్ మెంట్ రేషియో మంచిగా ఉండటంతో ఎల్ఐసీపై అందరికీ సదాభిప్రాయం ఏర్పడింది. అందుకే ప్రతి ఒక్కరూ దానిలో ఏదో ఒక పాలసీ కలిగి ఉండాలని భావిస్తారు. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగానే బీమా సంస్థ కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తోంది. బహుళ ప్రయోజనాలను అందించే ప్లాన్లను పరిచయం చేస్తోంది. మనీ బ్యాక్, లైఫ్, యాన్యుటీ వంటి పలు రకాల ప్లాన్లను ఆవిష్కరిస్తోంది. ఎల్ఐసీ ప్రతి వర్గానికి వారి అవసరానికి అనుగుణంగా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ వారి వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఆరాట పడే తల్లిదండ్రుల కోసం బెస్ట్ ప్లాన్ ను మీకు పరిచయం చేయబోతున్నాం. దాని పేరు ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్. దీనిలో పెట్టే పెట్టుబడిపై బీమా కవరేజీతో పాటు మనీ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. అతి తక్కువ ప్రీమియంతో అధిక రాబడిని మెచ్యూరిటీ సమయంలో పొందే ఈ ఎల్ఐసీ జీవన్ తరుణ పాలసీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ..
పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే కొంత మంది మాత్రమే సరియైన మార్గంలో వారి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పొదుపు చేస్తారు. అలాంటి పొదుపు ప్లస్ బీమా కవరేజీ అందించే ప్లాన్ ఎల్ఐసీ జీవన్ తరుణ్. ఇది నాన్ లింక్డ్, మనీ బ్యాక్ ప్లాన్ అంటేమీరు పెట్టే పెట్టుబడి తిరిగి మీ చేతికి వస్తుంది. ఇది మీ పిల్లలకు భవిష్యత్తులో ఉన్నత చదువులు, పెళ్లిళ్ల సమయంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఎటువంటి రిస్క్ టోలరెన్స్ ఉండదు. మీ సొమ్ము భద్రంగా ఉంటుంది. దీనిలో పాలసీ గరిష్ట కాల వ్యవధి కన్నా ఐదేళ్లు ముందే ప్రీమియం చెల్లింపులు నిలిపివేయొచ్చు. మీ పిల్లల పేరు మీద తీసుకొనే పాలసీ కాబట్టి వారి వయసు కనీసం 90 రోజుల నుంచి 12 ఏళ్ల లోపు ఉండాలి. ఇందులో ఏడాదికి కనీసం రూ. 75 మొత్తంతో పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు.
ఐదేళ్ల ప్రీమియం తగ్గుతుంది..
ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ తీసుకుంటూ మీరు మెచ్యూరిటీ సమయానికి కన్నా ఐదేళ్ల ముందే ప్రీమియం చెల్లింపులు నిలిపివేయొచ్చు. అంటే పాలసీ టెన్యూర్ 25ఏళ్లు ఉంటే.. మీరు ప్రీమియం చెల్లింపులు 20ఏళ్ల చేస్తే సరిపోతోంది. కానీ బీమా కవరేజీ మాత్రం 25ఏళ్ల వరకూ కొనసాగుతుంది. అలాగే ప్రీమియం చెల్లించడం మానేశాక కొంత భాగాన్ని వెనక్కి తీసుకొనే వెసులుబాటు ఉంటుంది.
ఈ ఉదాహరణలు చూడండి..
- మీ పిల్లలకు ఏడాది వచ్చేలోపే ఈ ప్లాన్ తీసుకుంటే అప్పుడు మీ మెచ్యూరిటీ టైం 24 ఏళ్లు ఉంటుంది. అప్పుడు మీరు ప్రీమియం 19 ఏళ్ల పాటు చెల్లిస్తే సరిపోతోంది. రూ. 10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే మీ నెలవారీ ప్రీమియం జీఎస్టీతో కలిసి రూ. 3,832 అవుతుంది. అంటే రోజుకీ రూ. 130చెల్లించాల్సి ఉంటుందన్నమాట.
- అదే మీ చిన్నారి వయసు రెండేళ్లప్పుడు మీరు పాలసీ తీసుకుంటే.. అప్పుడు మెచ్యూరిటీ 23 ఏళ్లకు అవుతుంది. అంటే మీరు 18 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీకు రోజుకు పడే ప్రీమియం రూ. 171. దీంతో మీరు చెల్లించే మొత్తం రూ. 10,89,196 అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత అంటే మీ బాబు వయసు 25 ఏళ్లు వచ్చేసరికి ఆ మొత్తం రూ. 28.24లక్షలు అవుతుంది. పిల్లల కోసం పెద్ద మొత్తంలో ఒకేసారి నగదు సమకూర్చుకొనే వెసులు బాటు ఈ ప్లాన్ మీకు అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..