Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: ఒకరికి పంపబోయి వేరే వ్యక్తికి ఫోన్ పే లేదా గూగుల్ పే చేశారా? ఆ డబ్బులు తిరిగిపొందడం ఎలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

కొన్ని సందర్బాల్లో యూపీఐ ఐడీ తప్పుగా ఇవ్వడం వల్లో లేక ఫోన్ నంబర్ తప్పుగా ఇవ్వడం వల్లో లేక మరేదైనా కారణం వల్ల మీ డబ్బులు వెళ్లవలసిన ఖాతాకు వెళ్ల కుండా మరో ఖాతాకు వెళ్లిపోతుంటాయి. లేదా మీ ఖాతాలో డబ్బులు డెబిట్ అవుతాయి గానీ అవతలి వ్యక్తి ఖాతాలో జమకావు. అలాంటి సందర్బంలో చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. మరి అలాంటి సమయంలో మనం ఏం చేయాలి?

UPI Payments: ఒకరికి పంపబోయి వేరే వ్యక్తికి ఫోన్ పే లేదా గూగుల్ పే చేశారా? ఆ డబ్బులు తిరిగిపొందడం ఎలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Upi Payments
Follow us
Madhu

|

Updated on: Sep 15, 2023 | 12:27 PM

మన భారతం డిజిటల్ బాటలో వేగంగా అడుగులు వేస్తోంది. కరోనా తర్వాత అన్ని రంగాల్లోనూ డిజిటలైజేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం శరవేగంగా దూసుకెళ్తోంది. జనాలకు డిజిటల్ పేమెంట్స్ అలవాటు అయిపోయాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ)ఆధారిత లావాదేవీలు అధికమయ్యాయి. కేవలం స్మార్ట్ ఫోన్ తోనే కేవలం ఓ కోడ్ స్కాన్ చేసేసి నగదు చెల్లించే అవకాశం ఉండటంతో అందరూ వీటిని అలవాటు పడ్డారు. పైగా సెకండ్ల వ్యవధిలో లావాదేవీ పూర్తవడం, ఎటువంటి ఇబ్బందులు పెద్దగా లేకపోవడంతో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే కొన్ని సందర్బాల్లో యూపీఐ ఐడీ తప్పుగా ఇవ్వడం వల్లో లేక ఫోన్ నంబర్ తప్పుగా ఇవ్వడం వల్లో లేక మరేదైనా కారణం వల్ల మీ డబ్బులు వెళ్లవలసిన ఖాతాకు వెళ్ల కుండా మరో ఖాతాకు వెళ్లిపోతుంటాయి. లేదా మీ ఖాతాలో డబ్బులు డెబిట్ అవుతాయి గానీ అవతలి వ్యక్తి ఖాతాలో జమకావు. అలాంటి సందర్బంలో చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. డబ్బు డెబిట్ అయిపోయి వేరే వారి ఖాతాలో జమకాక ఫెయిల్ అయితే అవి కొన్ని రోజుల్లో తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. కానీ తప్పు యూపీఐ ఐడీ కారణంగా వేరే వారికి ఖాతాకు నగదు జమైతే? మరి అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? వేరి వారి ఖాతా నుంచి తిరిగి నగదు ఎలా వెనక్కి తెప్పించుకోవాలి? తెలుసుకుందాం రండి..

యూపీఐలో సమస్యలు, పరిష్కారాలు..

సాధారణంగా యూపీఐలో ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలిస్తే.. వాటికి పరిష్కారాలు ఏంటో కనుగొనవచ్చు. యూపీఐ అనేది పేమెంట్ సొల్యూషన్. ఇది ఒకే యాప్‌లో ఒక వ్యక్తికి సంబంధించిన అనేక బ్యాంక్ ఖాతాలను ఇంటర్‌లింక్ చేస్తుంది. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది, యూపీఐ నుంచి నగదు బదిలీ చేయడానికి ఖాతా నంబర్ లేదా ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు అవసరం లేదు. దానికి బదులుగా, మీరు రిసీవర్ నమోదు చేసుకున్న యూపీఐ నంబర్, వర్చువల్ చెల్లింపు చిరునామా (వీపీఏ) లేదా వారి ఖాతా క్యూఆర్ కోడ్‌ని ఉపయోగించి నిధులను బదిలీ చేయవచ్చు. అయితే, మీరు తప్పు వీపీఏ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తే అప్పుడు మీ డబ్బు తప్పు యూపీఐ చిరునామాకు బదిలీ అయ్యి సమస్యలు తలెత్తవచ్చు.

వేరే వారికి వెళ్లిన డబ్బును వెనక్కి ఎలా పొందాలి..

డబ్బు వెళ్లిన వారిని సంప్రదించండి.. మీరు పేటీఎం, గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌లలోని టెక్స్టింగ్ స్పేస్‌లో మీ డబ్లు చేరిన వేరే వ్యక్తికి మెసేజ్ పంపొచ్చు. దీని ద్వారా వారిని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. తప్పుగా బదిలీ చేయబడిన డబ్బును బదిలీ చేయమని వారిని అడగవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీ వద్ద వారి నంబర్ ఉంటే, వారికి కాల్ చేసి, డబ్బును తిరిగి ఇవ్వమని మర్యాదగా అడగండి.

ఇవి కూడా చదవండి

మీ బ్యాంక్‌ని సంప్రదించండి.. ఒకవేళ మీరు రిసీవర్‌ను సంప్రదించలేకపోతే, మీ బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించండి. మీరు కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు లేదా అవసరమైన అన్ని రుజువులతో సమీపంలోని శాఖను సందర్శించవచ్చు. అధికారులు వివరాలతో సంతృప్తి చెందితే, వాపసును ప్రారంభించవచ్చు. అది తప్పు యూపీఐ లావాదేవీకి సంబంధించి సమర్పించిన వివరాల ఖచ్చితత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనికి గరిష్టంగా 45 రోజులు పట్టవచ్చు.

కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.. యూపీఐ యాప్‌లు మంచి కస్టమర్ కేర్ సేవలను అందిస్తాయి. మీ బ్యాంక్ మీకు సహాయం చేయలేకపోతే, డబ్బును స్వీకరించిన వ్యక్తి దానిని తిరిగి ఇవ్వడానికి అంగీకరించకపోతే లేదా మీరు గ్రహీతను సంప్రదించలేకపోతే మీరు వారిని సంప్రదించవచ్చు. మీరు మీరు 24 నుంచి 48 గంటలలోపు మొత్తాన్ని రీఫండ్ చేయమని వారిని అభ్యర్థించవచ్చు. అంతేకాకుండా, మీ బ్యాంకు, మీ రిసీవర్ బ్యాంక్ ఒకటే అయితే వాపసు ఇంకా వేగంగా పూర్తవుతుంది.

ఎన్పీసీఐ పోర్టల్‌లో నివేదించండి.. కస్టమర్ మద్దతు బృందాన్ని సంప్రదించడం కూడా సహాయం చేయకపోతే, ఎన్పీసీఐ పోర్టల్‌లో సమస్యను నివేదించండి. మీరు తప్పు లావాదేవీకి చెల్లుబాటు అయ్యే రుజువును జోడించాల్సి రావచ్చ. కాబట్టి బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో సిద్ధంగా ఉండండి. ఆ తర్వాత, మీ ఫిర్యాదుపై ఎన్పీసీఐ అధికారులు ప్రతిస్పందించే వరకు వేచి ఉండండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..