AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Temple Bonds: దేవుడికి కూడా వడ్డీకి డబ్బులు ఇవ్వొచ్చని తెలుసా? పైగా బాండ్ పేపర్ ష్యూరిటీతో..

మధ్యప్రదేశ్ ప్రభుత్వం టెంపుల్ బాండ్స్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఉజ్జయినిలోని ఆలయాల పునరుద్ధరణ, పర్యాటక సౌకర్యాల అభివృద్ధికి రూ.200 కోట్లు సేకరిస్తుంది. ఇవి మునిసిపల్ బాండ్ల వంటి స్థిర ఆదాయ పెట్టుబడులు. ప్రజలు ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా వడ్డీని పొందవచ్చు. తద్వారా పుణ్యంతో పాటు ఆర్థిక ప్రయోజనం కూడా లభిస్తుంది.

Temple Bonds: దేవుడికి కూడా వడ్డీకి డబ్బులు ఇవ్వొచ్చని తెలుసా? పైగా బాండ్ పేపర్ ష్యూరిటీతో..
Temple Bonds
SN Pasha
|

Updated on: Jun 01, 2026 | 5:21 PM

Share

సాధారణంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కుబేరుడికి అప్పు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. కానీ, ఇక దేవుళ్లు భక్తులకు కూడా అప్పు ఉంటారు. పైగా ఆ అప్పుకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వడ్డీ కూడా ఇస్తారు. అంటే సాధారణ ప్రజలు ఎవరైనా సరే దేవుడికి, దేవుడి గుడికి వడ్డీకి డబ్బులు ఇస్తూ.. దేవుడితో వడ్డీ వ్యాపారం చేయవచ్చు. వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం. టెంపుల్ బాండ్స్ పేరుతో ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అందరికీ తెలిసిన మునిసిపల్ బాండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ లానే ఈ టెంపుల్ బాండ్స్ కూడా ఉంటాయి.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉజ్జయిని ప్రాంతంలో దేవాలయాల పునరుద్ధరణ, పర్యాటక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.200 కోట్లు సేకరించాలనే ప్రణాళికలో ఉంది. ఇది సింహస్థ ఫెస్టివల్ ముందు చేపట్టే పెద్ద అభివృద్ధి కార్యక్రమంలో భాగం అని సమాచారం. టెంపుల్ బాండ్స్ అనేవి స్థిర ఆదాయం ఇచ్చే ఫైనాన్షియల్ స్కీమ్స్. వీటి ద్వారా సేకరించిన డబ్బు దేవాలయాల మరమ్మత్తు, అభివృద్ధి కోసం వాడతారు. అలాగే రోడ్లు, పార్కింగ్ స్థలాలు, లైటింగ్, నీటి సరఫరా, భద్రత వ్యవస్థలు, భక్తుల సౌకర్యాల కోసం కూడా ఉపయోగిస్తారు. ఈ బాండ్స్ గురించి వింట్ వెల్త్ కో-ఫౌండర్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అంషుల్ గుప్తా మాట్లాడుతూ.. “ఇవి మునిసిపల్ బాండ్స్ లాంటివే. తేడా ఏంటంటే సేకరించిన డబ్బు ప్రత్యేకంగా దేవాలయాల అభివృద్ధి కోసం మాత్రమే వాడతారు. సాధారణంగా మునిసిపల్ బాండ్స్ రోడ్లు, నగర సదుపాయాల కోసం ఇస్తారు. కానీ ఇక్కడ లక్ష్యం దేవాలయాలు, ఆధ్యాత్మిక స్థలాలు” అని అన్నారు.

కాగా ఈ టెంపుల్ బాండ్స్ తో సేకరించే డబ్బు ఉజ్జయిని, మాల్వా ప్రాంతంలో ఉన్న 11 ప్రదేశాల అభివృద్ధికి ఇవి ఉపయోగపడనున్నాయి. ఈ ప్రాజెక్టులో కల భైరవ టెంపుల్, మంగళనాథ్ టెంపుల్, సందీపని ఆశ్రమం, మహాకాళేశ్వర్ టెంపుల్ సర్క్యూట్ వంటి ప్రముఖ స్థలాలు కూడా ఉన్నాయి. అయితే ప్రజలు డబ్బు చెల్లించి, ఈ బాండ్స్ ష్యూరిటీగా పొందవచ్చు. సుమారు పదేళ్ల మెచ్యురిటీ పీరియడ్ కలిగి ఉంటాయి. ప్రతి నెలా దీనిపై వడ్డీ లెక్కిస్తారు. సో.. అదన్నమాట ఈ టెంపుల్ బాండ్స్ కథ. మరి మీ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేసేందుకు డబ్బుంటే.. టెంపుల్ బాండ్స్ తీసుకొని, వడ్డీకీ వడ్డీ, పుణ్యానికి పుణ్యం పొందండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!