Quant Mutual Funds: క్యాంట్ ఫండ్స్ పై యువతలో పెరుగుతున్న ఆసక్తి.. ప్రధాన కారణం అదే..

Quant Mutual Funds: ప్రపంచంలో సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, మ్యూచువల్ ఫండ్స్ దాని ప్రయోజనాన్ని ఎందుకు పొందడం లేదని సునీల్ ఆశ్చర్యపోతున్నాడు.

Quant Mutual Funds: క్యాంట్ ఫండ్స్ పై యువతలో పెరుగుతున్న ఆసక్తి.. ప్రధాన కారణం అదే..
Mf Investment
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 06, 2022 | 10:43 AM

Quant Mutual Funds: ప్రపంచంలో సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, మ్యూచువల్ ఫండ్స్ దాని ప్రయోజనాన్ని ఎందుకు పొందడం లేదని సునీల్ ఆశ్చర్యపోతున్నాడు. కొంతమంది వ్యక్తులు ఫండ్‌ను నిర్వహించే బదులు సాంకేతికతను దాని కోసం ఎందుకు ఉపయోగించరు అని అతను ఆలోచనలో పడ్డాడు. టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చెందిన మ్యూచువల్ ఫండ్ కోసం సునీల్ చూస్తున్నాడు. ఆ నిధులు మనుషుల పర్యవేక్షణ లేదా నిర్ణయాలు లేకుండా ఉండాలి. ఇక్కడ మానవ పక్షపాతం అంటే ఏమిటో మీకు తెలిసి ఉండవచ్చు. ఫండ్ మేనేజర్ కొన్ని వ్యక్తిగత ప్రోత్సాహకాలను కలిగి ఉంటారు. దాని కారణంగా ఫండ్ మేనేజర్లు కొన్ని నిర్దిష్ట స్టాక్‌లలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడతారు.

భారత్ లో మ్యూచువల్ ఫండ్స్‌కు క్రేజ్ వేగంగా పెరుగుతోంది. వ్యక్తులు తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడానికి ముందు వివిధ అంశాలను పరిశీలిస్తారు. మంచి మ్యూచువల్ ఫండ్ కోసం వెతకడం కేవలం మంచి రాబడిని ఇచ్చే దానితో ముగియదు. సునీల్ లాంటి వ్యక్తులు టెక్నాలజీని ఉపయోగించిన ఫండ్‌లను కోరుకుంటారు. దీని వల్ల పెట్టుబడిదారులు తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందవచ్చు.

ఈ రోజుల్లో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి ప్రతి పరిశ్రమపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇది హ్యూమన్- మెషిన్ ఇంటర్‌ఫేస్ అవగాహనను మారుస్తోంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ దాని నుంచి ఎలా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం మెషిన్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్‌ని మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఉపయోగిస్తోంది. అందులోనూ ప్రత్యేకంగా క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ సాంకేతికతను వినియోగిస్తోంది. మీరు క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి అని ఆలోచిస్తూ ఉండవచ్చు.

దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం సెక్యూరిటీస్ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించి, ఆపై లాభం పొందడానికి క్రమబద్ధమైన మార్గాన్ని ఉపయోగించడం. అటువంటి ఫండ్‌లో మానవ ఇంటర్‌ఫేస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌లు ETFల మాదిరిగానే ఉంటాయా? క్వాంట్ ఫండ్‌లు సాధారణంగా యాక్టివ్ ఫండ్‌లుగా పరిగణించబడతాయి. అయితే యాక్టివ్ ఫండ్‌ల మాదిరిగా కాకుండా.. ప్రత్యామ్నాయాల మధ్య ఎంచుకోవడానికి ఆటోమేటెడ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు దీని గురించి నిపుణుల అభిప్రాయాన్ని చూద్దాం.

రూల్-బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ పదాలలో క్వాంట్ లేదా క్వాంటిటేటివ్ పెట్టుబడి ఒకటని NJ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డైరెక్టర్, CEO, రాజీవ్ శాస్త్రి వెల్లడించారు. ఇది ప్యాసివ్ ఇన్వెస్ట్ మెంట్, యాక్టివ్ మ్యానేజ్ మెంట్ కలయిక. ఇది మార్కెట్ డైనమిక్స్ ప్రకారం పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు నియమ-ఆధారిత పెట్టుబడి మానవ తప్పిదాలను, పక్షపాతాన్ని నివారిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రిటర్న్స్ పరిస్థితి ఏమిటి?

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఫండ్‌ల పనితీరును అంచనా వేయడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అవి కంప్యారిటివ్ గా కొత్తవి. అయినప్పటికీ సగటున ఏడాదికి వీటిలో 15 శాతం రాబడిని సాధించాయి.

మీరు పెట్టుబడి పెట్టాలా?

కాబట్టి మీరు వాటిలో పెట్టుబడి పెట్టాలా అని ఆలోచించవచ్చు. ఫండ్ మేనేజ్‌మెంట్ ప్రమాదాన్ని నివారించాలనుకునే పెట్టుబడిదారులకు క్వాంట్ ఫండ్‌లు మంచివి. నియమాల ఆధారితమైన, ఎటువంటి మానవ తప్పిదాలు లేదా పక్షపాతం లేని ఫండ్‌లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇవి ఉత్తమం. ఈ మ్యూచువల్ ఫండ్ యువతలో ఎక్కువ ప్రజాదరణ పొందాయి. కాబట్టి ఈ ఫండ్ కొత్త సాంకేతికతను ఇష్టపడే, భయపడని టెక్ శ్యావీ ఇవ్వెస్టర్లకు మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.