టాటా మోటార్స్ ఇండియాలో తన ఎలక్ట్రిక్ కార్లను వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్ లో టాటా కంపెనీ టాటీ టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ, టైగోర్ ఈవీ వంటి మోడళ్లతో కస్టమర్స్ ను ఆకట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల ప్రియులు ఆటో ఎక్స్ పో ఎలాంటి కార్లు ఆవిష్కరిస్తారో అని వేచి చూస్తున్నారు. అయితే అలాంటి వారికి టాటా మోటార్స్ శుభవార్త చెప్పనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆటో ఎక్స్ పోలో టాటా పంచ్ ఈవీని ఆవిష్కరించే అవకాశం ఉందని, పేర్కొంటున్నాయి.
టాటా పంచ్ ఈవీ ఆ కంపెనీ ఈవీ లైనప్ లో నాలుగో మోడల్. అయితే తాజా మోడల్ లో సిగ్మా ప్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తుందని తెలుస్తోంది. దీంతో కార్ క్యాబిన్ స్థలం చాలా బాగుంటుందని అంచనా వేస్తున్నాయి. పంచ్ ఈవీ లో కూడా పవర్ ట్రైన్ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన మోడల్స్ లానే ఈ కార్ కు కూడా డబుల్ బ్యాటర్ ప్యాకప్ ఉంటుందని పేర్కొంటున్నాయి.
ఈ కార్లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ మోడ్‌లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉంటాయని తెలుస్తుంది. అలాగే ఈ కార్ ధర ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9 నుంచి 10 లక్షల రూపాయల వరకూ ఉంటుందని అనుకుంటున్నారు. దీంతో టాటా పంచ్ ఈవీ, టైగోర్ ఈవీ, టియాగో ఈవీ ఈ మూడు కార్లు ఒకే ప్రైస్ రేంజ్ లో ఉంటాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి