Semi Conductor: చైనాకు షాక్ ఇవ్వనున్న తైవాన్.. భారత్‌లో చిప్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రెడీ!
ప్రపంచమంతా సెమీకండక్టర్ అంటే చిప్ కొరతతో ఇబ్బంది పడుతోంది. ఇది భారతదేశంలోని ఆటో.. గాడ్జెట్‌ల పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా, ఆటో కంపెనీల ఉత్పత్తి తగ్గిపోయింది.
Semi Conductor Industry: ప్రపంచమంతా సెమీకండక్టర్ అంటే చిప్ కొరతతో ఇబ్బంది పడుతోంది. ఇది భారతదేశంలోని ఆటో.. గాడ్జెట్‌ల పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా, ఆటో కంపెనీల ఉత్పత్తి తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఈ సమస్య త్వరలో తీరబోతోంది. చిప్ కొరతను అధిగమించడానికి, ఇండియా, తైవాన్ మధ్య ఒక ఒప్పందం జరుగుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా కింద చిప్ భారతదేశంలోనే ఉత్పత్తి అవుతుంది.
వాస్తవానికి 80% చిప్స్ తైవాన్ అదేవిధంగా దక్షిణ కొరియాలో తయారు అవుతాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రతిపాదన విజయవంతంగా అమలు అయితే కనుక అది భారతదేశంలో సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే, ఈ ఒప్పందం చైనాకు హాని కలిగిస్తుందని.. దీంతో ఆ దేశంతో కొత్త వివాదం తలెత్తవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ప్లాంట్ కోసం రూ. 55.23 వేల కోట్ల వ్యయం..
చిప్ తయారీ ప్లాంట్ విషయంపై భారత్.. తైపీ అధికారులు వారంరోజులుగా చర్చిస్తున్నారు. భారతదేశంలో 7.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 55.23 వేల కోట్లు) చిప్ ప్లాంట్ నిర్మించబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 5 జి పరికరాల నుండి ఎలక్ట్రిక్ కార్ల వరకు భాగాలు ఉంటాయని వారంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు చైనాకు వ్యతిరేకంగా ఆర్థిక, సైనిక సంబంధాలను పెంచుకుంటున్న సమయంలో ఈ ఒప్పందం జరుగుతోంది. ఒకవైపు తైవాన్‌తో ఈ ఒప్పందం లాభదాయకమైన ఒప్పందం అయితే, మరోవైపు చైనాతో ఉద్రిక్తత పెరుగుతుందనే భయం ఉంది. చైనా తైవాన్‌ను తన దేశంలో భాగంగా పరిగణిస్తుంది. మరోవైపు, తైవాన్ తనను తాను స్వతంత్ర దేశంగా భావిస్తుంది. ఇప్పుడు ఇది చిక్కుముడిగా మరొచ్చని నిపుణులు అంటున్నారు.
క్వాడ్ గ్రూప్ సమావేశం నుండి ఈ ఒప్పందానికి ఊతం లభించింది,
గత కొన్ని వారాలుగా, చర్చలు మరింత వేగంగా పురోగమిస్తున్నాయి. చిప్ సరఫరా గొలుసును పెంచడానికి క్వాడ్ మీటింగ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి క్వాడ్ గ్రూప్ సృష్టించారు. ఈ సమావేశంలో, భారతదేశంతో పాటు, ఆస్ట్రేలియా, జపాన్ కూడా చిప్ సమస్య గురించి చర్చించాయి.
1.77 లక్షల కోట్ల విలువైన చిప్‌లను ఇండియా దిగుమతి చేసుకుంది.
ఇటీవల, భారతదేశంలో చిప్స్ లేకపోవడం వల్ల జియో ఫోన్ లాంచ్ ఆలస్యమైంది. ఇది గూగుల్ భాగస్వామ్యంతో తయారు అయింది. ప్రస్తుతం, భారతదేశం 24 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.77 లక్షల కోట్లు) విలువైన సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుంటుంది. ఇది 2025 సంవత్సరం నాటికి దాదాపు 100 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 7.38 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా.
సెమీకండక్టర్ చిప్స్ అంటే ఏమిటి?
- నేడు ప్రతి ఒక్కరూ ఒక రోజులో పదుల సంఖ్యలో గాడ్జెట్‌లను ఉపయోగిస్తున్నారు. అది కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ కార్లు, వాషింగ్ మెషీన్‌లు, ATM లు, ఆసుపత్రులు లేదా చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు అయినా. సెమీకండక్టర్స్ లేకుండా తయారు కావు. ఈ చిప్స్ లేదా సెమీకండక్టర్‌లు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు చిన్న మెదడు లాంటివి అని చెప్పవచ్చు.
- సెమీకండక్టర్ చిప్స్ సిలికాన్‌తో తయారు అవుతాయి. ఇవి మంచి విద్యుత్ వాహకాలు. ఇవి మైక్రో సర్క్యూట్లలో అమర్చి ఉంటాయి. ఇవి లేకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్‌లు పనిచేయవు. అన్ని క్రియాశీల భాగాలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, మైక్రోచిప్‌లు, ట్రాన్సిస్టర్‌లు, ఎలక్ట్రానిక్ సెన్సార్లు ఈ చిప్‌లతో తయారవుతాయి.
- ఈ సెమీకండక్టర్స్ హై-ఎండ్ కంప్యూటింగ్, ఆపరేషన్ కంట్రోల్, డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ మేనేజ్‌మెంట్, సెన్సింగ్, వైర్‌లెస్ కనెక్టివిటీ ఇలా మరిన్నిటిలోనొ సహాయపడతాయి. అలాగే, ఈ చిప్స్ కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, అధునాతన వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు, బ్లాక్‌చెయిన్ అప్లికేషన్‌లు, 5G, IoT, డ్రోన్‌లు, రోబోటిక్స్, గేమింగ్ మరియు వేరబుల్‌లలో అంతర్భాగంగా మారాయి.
Also Read: Building Collapsed: హమ్మయ్య.. అంతా సేఫ్.. ఇలా బయటకు వచ్చారో లేదో కూలింది..