Swiggy IPO: ఐపీఓ వాల్యూ భారీగా పెంచిన స్విగ్గీ.. అదనపు నిధుల సేకరణే లక్ష్యం

ఫుడ్ టెక్ మేజర్ స్విగ్గీ షేర్‌హోల్డర్లు అక్టోబర్ 3న జరిగిన అసాధారణ సాధారణ సమావేశంలో (ఈజీఎం) తన ఐపీఓకు సంబంధించిన ప్రైమరీ ఇష్యూ పరిమాణాన్ని రూ. 3,750 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లకు పెంచే తీర్మానాన్ని ఆమోదించారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్విగ్గీ కంపెనీ పెద్ద ఐపీఓ కోసం ఒక నిబంధనను రూపొందించింది. స్విగ్గీ కంపెనీకి అదనపు నిధులు అవసరమైతే పరిమాణం రూ. 1,250 కోట్లు పెరుగుతుంది. కచ్చితంగా చెప్పాలంటే ప్రాథమిక ఇష్యూ పరిమాణం మాత్రమే రూ.3,750 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచుతారు.

Swiggy IPO: ఐపీఓ వాల్యూ భారీగా పెంచిన స్విగ్గీ.. అదనపు నిధుల సేకరణే లక్ష్యం
Swiggy - Sriharsha Majety
Follow us
Srinu

|

Updated on: Oct 04, 2024 | 5:00 PM

ఫుడ్ టెక్ మేజర్ స్విగ్గీ షేర్‌హోల్డర్లు అక్టోబర్ 3న జరిగిన అసాధారణ సాధారణ సమావేశంలో (ఈజీఎం) తన ఐపీఓకు సంబంధించిన ప్రైమరీ ఇష్యూ పరిమాణాన్ని రూ. 3,750 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లకు పెంచే తీర్మానాన్ని ఆమోదించారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్విగ్గీ కంపెనీ పెద్ద ఐపీఓ కోసం ఒక నిబంధనను రూపొందించింది. స్విగ్గీ కంపెనీకి అదనపు నిధులు అవసరమైతే పరిమాణం రూ. 1,250 కోట్లు పెరుగుతుంది. కచ్చితంగా చెప్పాలంటే ప్రాథమిక ఇష్యూ పరిమాణం మాత్రమే రూ.3,750 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచుతారు. అయితే ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ రూ. 6,664 కోట్ల వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది. బెంగుళూరు ఆధారిత కంపెనీ పబ్లిక్ మార్కెట్ అరంగేట్రం అతిపెద్ద న్యూ జనరేషన్ ఐపీఓలో ఒకటిగా ఉండబోతోంది. ఇది పెరిగిన ఐపీఓ విషయంలో రూ. 10,414 కోట్లు లేదా రూ. 11,664 కోట్లుగా నిర్ణయిస్తారు. అయితే ఈ వార్తలపై స్విగ్గీ అధికారికంగా స్పందించలేదు. 

అలాగే జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, టాటా బిగ్‌బాస్కెట్ మరిన్ని లాభదాయకమైన న్యూ ఏజ్ కంపెనీల నుంచి స్విగ్గి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న సమయంలో  స్విగ్గీ ఐపీఓ నిర్ణయం తీసుకుంది. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ నష్టాలు తగ్గుముఖం పట్టడంతో పాటు రాబడులు పెరగడం వంటి కారణాల వల్ల జొమాటోతో మళ్లీ పోటీలోకి వచ్చింది. గత నివేదికల ప్రకారరం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,265 కోట్ల నుంచి 36 శాతం పెరిగి 24 ఆర్థిక సంవత్సరంలో రూ.11,247 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో దాని నష్టాలు రూ. 4,179 కోట్ల నుండి రూ. 2,350 కోట్లకు 44 శాతం తగ్గాయి. ఖర్చులపై బలమైన నియంత్రణకు ఇది సహాయపడింది. అయితే జొమాటో 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.12,114 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో కంపెనీల లాభాల వాటా రూ.351 కోట్ల వరకు ఉంది. 

2025 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో స్విగ్గీ వృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వడంతో కంపెనీ నష్టాలు పెరిగాయి. క్యూ1లో స్విగ్గీ నష్టాలు 8 శాతం పెరిగి రూ. 611 కోట్లకు చేరాయి. ఖర్చుల పెరుగుదలపై ఏడాది క్రితం రూ. 564 కోట్లుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మూడు నెలల్లో కంపెనీ రూ. 3,908 కోట్లు ఖర్చు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఖర్చు చేసిన రూ. 3,073 కోట్లతో పోలిస్తే ఇది 27 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో కార్యకలాపాల ద్వారా స్విగ్గీ ఆదాయం రూ. 3,222.2 కోట్లుగా ఉంది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ. 2,389.8 కోట్లతో పోలిస్తే 35 శాతం పెరిగింది.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.