టాటా సన్స్‌కి నోటీసులు జారీ చేసిన సుప్రీం..!

ప్రముఖ టాటా సన్స్‌ సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్‌ ఆదేశాల్లోని అతిక్రమణలను

  • Tv9 Telugu
  • Publish Date - 7:27 am, Sat, 30 May 20
టాటా సన్స్‌కి నోటీసులు జారీ చేసిన సుప్రీం..!

ప్రముఖ టాటా సన్స్‌ సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్‌ ఆదేశాల్లోని అతిక్రమణలను తొలగించాలని కోరుతూ సైరస్ మిస్త్రీ, ఆయన కంపెనీ దాఖలు చేసిన క్రాస్‌- అప్పీలుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం టాటా సన్స్‌కు నోటీసులు జారీ చేసింది.

కాగా మిస్త్రీని తిరిగి టాటా సన్స్ ఎగ్జిగ్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమించాలని చెబుతూ గతేడాది డిసెంబర్‌లో ఎల్‌సీఎల్ఏటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్టే ఇస్తూ జనవరి 10న టాటా గ్రూప్‌ సంస్థకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఈ క్రమంలో మిస్త్రీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ క్రాస్‌ అప్పీలు దాఖలు చేసింది. టాటా సన్స్‌లో తనకు, తన కుటుంబానికి ఉన్న 18.37 శాతానికి అనుగుణంగా కంపెనీలో ప్రాతినిధ్యం ఉండాలని మిస్త్రీ ఆ క్రాస్‌ అప్పీలులో కోరినట్లు తెలుస్తోంది. దీనిపై విచారించిన జస్టిస్‌ ఎ.ఎస్‌.బొపన్న, రిషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం టాటా సన్స్‌కి నోటీసులు జారీ చేసింది.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: ఇకపై రైల్వే టీటీఈలు ఎలా కనిపించబోతున్నారంటే..!