భారతదేశ జీడీపీ వృద్ధిరేటు ఎంతకు పడిపోయిందంటే..!

కరోనా రాకాసి పురుగు ప్రపంచాన్ని చుట్టేస్తుంది. దీంతో అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. లక్షల్లో కేసులు వేలల్లో మరణాలతో దిక్కుతోచని స్థితికి చేరాయి. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లోకి వెళ్లడంతో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో అయా దేశాల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక, క‌రోనా మ‌హ‌మ్మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2019-20 ఆర్థిక సంవత్స‌రానికిగాను భార‌త‌దేశ జీడీపీ వృద్ధిరేటు 11 ఏండ్ల‌ కనిష్ఠ స్థాయికి పడిపోయిందని జాతీయ గణాంక […]

భారతదేశ జీడీపీ వృద్ధిరేటు ఎంతకు పడిపోయిందంటే..!
Follow us

|

Updated on: May 29, 2020 | 9:24 PM

కరోనా రాకాసి పురుగు ప్రపంచాన్ని చుట్టేస్తుంది. దీంతో అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. లక్షల్లో కేసులు వేలల్లో మరణాలతో దిక్కుతోచని స్థితికి చేరాయి. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లోకి వెళ్లడంతో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో అయా దేశాల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక, క‌రోనా మ‌హ‌మ్మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2019-20 ఆర్థిక సంవత్స‌రానికిగాను భార‌త‌దేశ జీడీపీ వృద్ధిరేటు 11 ఏండ్ల‌ కనిష్ఠ స్థాయికి పడిపోయిందని జాతీయ గణాంక సంస్థ వెల్ల‌డించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి- మార్చి త్రైమాసికం) భార‌త‌ జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంగా నమోదైంది. ఇక, ఈ ఆర్థిక సంవ‌త్స‌రం 2019-2020 మొత్తానికి భార‌తదేశ జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతంగా న‌మోదైంది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది చాలా త‌క్కువ‌. 2018-19 ఆర్థిక ఏడాదిలో 6.1 శాతంగా ఉన్న భార‌త‌దేశ జీడీపీ వృద్ధిరేటు 2019-2020 ఆర్థిక ఏడాదిలో 4.2 శాతానికి ప‌డిపోయింది. కరోనా వైరస్ ప్ర‌బ‌ల‌డంతో ప్రపంచ దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉత్పత్తి, సేవ రంగాలతో పాటు అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దీంతో ఆ ప్రభావం భారత్‌పైనా పడింది.