Success Story: 60 ఏళ్ల తర్వాత బిలియనీర్‌గా మారిన ఎల్‌ఐసీ ఏజెంట్.. అతనెవరో తెలుసా?
దేశంలో చాలా మంది ప్రజలు అదనపు ఆదాయం కోసం ఎల్‌ఐసీ ఏజెంట్లుగా మారుతున్నారు. ఈ రోజు మనం ఒక ఎల్‌ఐసీ ఏజెంట్ గురించి తెలుసుకుందాం. అతను వ్యాపారవేత్త కావాలనే తన కలను ఎన్నటికీ చావనివ్వలేదు. అలాగే 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ తర్వాత ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పుడు 93 ఏళ్ల వయసులో ఉన్న సోనాలికా
దేశంలో చాలా మంది ప్రజలు అదనపు ఆదాయం కోసం ఎల్‌ఐసీ ఏజెంట్లుగా మారుతున్నారు. ఈ రోజు మనం ఒక ఎల్‌ఐసీ ఏజెంట్ గురించి తెలుసుకుందాం. అతను వ్యాపారవేత్త కావాలనే తన కలను ఎన్నటికీ చావనివ్వలేదు. అలాగే 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ తర్వాత ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పుడు 93 ఏళ్ల వయసులో ఉన్న సోనాలికా గ్రూప్ ఛైర్మన్, యజమాని లక్ష్మణ్ దాస్ మిట్టల్ గురించి తెలుసుకుందాం. అతను భారతదేశపు అత్యంత వృద్ధ బిలియనీర్ కావచ్చు. కానీ అతని విజయగాథ ఇప్పటికీ చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంది. లక్ష్మణ్ దాస్ మిట్టల్ ప్రభుత్వ కళాశాలలో చదివి ఆ తర్వాత ఆంగ్లంలో ఎంఏ చేశారు. 1955లో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేయడం ప్రారంభించాడు. అతను ఎల్‌ఐసీ ప్రారంభ ఏజెంట్లలో ఒకడు. 40 ఏళ్ల వయస్సులో అతను తన గ్రామంలో సోనాలికా పేరుతో థ్రెషర్‌లను తయారు చేయడం ప్రారంభించాడు.
కానీ వెంటనే అతను నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. 1970లో అతని కుటుంబం మొత్తం నికర విలువ రూ. 1 లక్షకు తగ్గింది. దివాలా తీసిన తర్వాత అతను చాలా పనులు చేశాడు. కానీ అతను 1995లో సోనాలికా గ్రూప్ ఆధ్వర్యంలో ‘ట్రాక్టర్’ తయారీని ప్రారంభించినప్పుడు విజయం సాధించాడు. సోనాలికా మొదటి ట్రాక్టర్ 1996లో విక్రయించాడు.
నంబర్-1 ఎగుమతి కంపెనీగా..
కొద్ది కాలంలోనే సోనాలికా ట్రాక్టర్లకు డిమాండ్ పెరగడం మొదలైంది. నేడు సోనాలికా అల్జీరియా ట్రాక్టర్ మార్కెట్‌లో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. సోనాలికా నేపాల్, బంగ్లాదేశ్‌లో 20 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ భారతదేశంలో 10 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. అలాగే మొత్తం 150 కంటే ఎక్కువ దేశాలకు ట్రాక్టర్లు, దాని వ్యవసాయ పరికరాలను ఎగుమతి చేస్తుంది. సోనాలికా ట్రాక్టర్స్ దేశంలోనే నంబర్-1 ఎగుమతి కంపెనీగా పేరు తెచ్చుకోవడానికి ఇదే కారణం.
లక్ష్మణ్ దాస్ మిట్టల్ సంపద గురించి చెప్పాలంటే.. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం.. అతని నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 24,000 కోట్లు). ఆయన కుమారులు అమృత్ సాగర్, దీపక్ మిట్టల్ ఈరోజు కంపెనీ రోజువారీ కార్యకలాపాలను చూస్తున్నారు. అతని మనవళ్లు సుశాంత్, రామన్ కూడా కంపెనీలో పని చేయడం ప్రారంభించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి