Riding The Waves: సముద్రంలో ఈవీ స్కూటర్‌తో స్టంట్స్.. లైక్స్ కోసం ఓ యువకుడి పిచ్చిపని
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు ఓ ప్రమాదకర పని చేస్తూ వీడియోను షేర్ చేశాడు. సముద్రంలో ఈవీ స్కూటర్‌ను రైడ్ చేశాడు. చూడడానికి ప్రమాదకరంగా ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన ఎక్కడ జరిగిందో..? తెలియదు కానీ ఆ సమయంలో పోలీసులు వస్తే మాత్రం మనోడి పని పట్టేవారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావడం పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్‌లో తమ ప్రత్యేకతను నిరూపించుకునేందుకు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు ఓ ప్రమాదకర పని చేస్తూ వీడియోను షేర్ చేశాడు. సముద్రంలో ఈవీ స్కూటర్‌ను రైడ్ చేశాడు. చూడడానికి ప్రమాదకరంగా ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన ఎక్కడ జరిగిందో..? తెలియదు కానీ ఆ సమయంలో పోలీసులు వస్తే మాత్రం మనోడి పని పట్టేవారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆ వీడియో బహుళ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భాగస్వామ్యం చేశారు. అయితే ఫాలోవర్స్ సంగతి ఎలా ఉన్నా భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ వీడియోలో సముద్రంలో స్కూటర్ నడుపడానికి ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని వెళ్లాడు. కొంత దూరం సముద్రంలోకి వెళ్లాక అలల తాకిడి స్కూటర్‌పై పట్టుకోల్పోయాడు. ఒకానొక దశలో పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో పెద్ద కెరటం నేరుగా తనపైకి రావడం చూసి యూటర్న్ తీసుకుని కిందపడిపోయాడు. మళ్లీ ఎలాగో అలా లేచి అతను తన స్కూటర్‌ని తీసుకొని బయటకు వచ్చారు. అయితే వీడియోలో ఆ వ్యక్తి ముఖం అస్పష్టంగా ఉంది. అలాగే వీడియో లొకేషన్ కూడా అస్పష్టంగా ఉంది అయితే ఇది భారతదేశంలోని తీర ప్రాంతం నుండి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో కొన్ని వారాల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకు 1.5 కోట్ల వ్యూస్ సంపాదించింది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి..
View this post on Instagram
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..