Stock market vs mutual funds: స్టాక్ మార్కెట్ vs మ్యూచువల్ ఫండ్స్? ఎవరికి ఏది మంచిది? ఇలా తెలుసుకోండి!
డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా? లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలా? ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? ఎందుకు రిస్క్ తక్కువ ఉంటుంది? ఇలా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్ కు సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.

డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా? మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలా? అన్న ప్రశ్నకు ఒక్క ముక్కలో సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది పెట్టుబడి పెడుతున్న వ్యక్తిని బట్టి ఉంటుంది. కానీ, మీరు తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే.. ఈ రెండింటిలో మీరు దేన్ని ఎంచుకున్నా మీ డబ్బు వెళ్లేది స్టాక్ మార్కెట్ లోకే.. అదెలా అనుకుంటున్నారా?
రెండూ ఈక్విటీనే
స్టాక్ మార్కెట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. ఈ రెండు స్టాక్ మార్కెట్ కు సంబంధించినవే.. అంటే మన డబ్బుని దేశంలోని రకరకా కంపెనీల స్టాక్స్ లో పెట్టుబడి పెడుతున్నాం అన్న మాట. స్టాక్ మార్కెట్ లో నేరుగా మీరే స్టాక్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మ్యుచువల్ ఫండ్స్ లో మీ బదులు ఆ పనిని నిపుణుడైన ఫండ్ మేనేజర్ చేస్తాడు. ఇదే తేడా. ఇంతకీ దేన్ని ఎంచుకోవడం కరెక్ట్? అనేగా మీ డౌట్..
ఏది బెస్ట్?
స్టాక్స్ తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ తక్కువ. ఉదాహరణకు మీరు స్టాక్ మార్కెట్ లో రూ.100 ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ ధరను బట్టి మీకు కొన్ని స్టాక్స్ ఇస్తారు. స్టాక్ వాల్యూ పెరిగితే లాభం లేదా నష్టం అంతే. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో అలా కాదు. మీరు ఒక ఫండ్ లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే.. ఆ రూ.100 కాస్తా.. డివైడ్ అయ్యి పది, ఇరవై స్టాక్స్ లోకి వెళ్తాయి. అంటే రూ.10, రూ.5 గా డివైడ్ అయ్యి మల్టిపుల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ అవుతాయి. ఇక్కడ ఒకేసారి ఆ పది, ఇరవై కంపెనీలు నష్టపోతే కానీ మీకు నష్టం ఉండదు. సో.. స్టాక్స్ తో పోలిస్తే.. మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే బెనిఫిట్ ఇది. మ్యూచువల్ ఫండ్స్ లో గవర్నమెంట్ బాండ్స్, గోల్డ్, సిల్వర్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది మరింత సేఫ్ ఆప్షన్.
స్టాక్స్ ఎవరికి?
‘ఎక్కువ రిటర్న్స్ కావాలి. నేను రిస్క్ చేస్తాను’ అనుకునే వాళ్లు నేరుగా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చ. ఒకవేళ మార్కెట్ బాగుంటే మంచి లాభాలు రావొచ్చు. మీకు స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఉంటే స్టాక్స్ లో నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా మీరు మరింత సేఫ్టీని దృష్టిలో ఉంచుకుంటే.. మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోవచ్చు. సగం నాలెడ్జ్‌తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకున్న విషయం.
చివరిగా చెప్పేదేంటంటే.. స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా మార్కెట్ ను బట్టి లాభ నష్టాలు మారుతుంటాయి. రిస్క్ వద్దు అనుకునే వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోవడం బెటర్. మీకు స్టాక్ మార్కెట్ పై మంచి అవగాహన ఉంటే అప్పుడు స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




