Stock Market Today: కొనసాగుతున్న బుల్ జోరు.. రికార్డు గరిష్ఠ స్థాయిలో సూచీలు.. తొలిసారిగా 61వేల ఎగువున సెన్సెక్స్

|

Oct 14, 2021 | 10:06 AM

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది. సూచీలు రికార్డు గరిష్ఠ స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.

Stock Market Today: కొనసాగుతున్న బుల్ జోరు.. రికార్డు గరిష్ఠ స్థాయిలో సూచీలు.. తొలిసారిగా 61వేల ఎగువున సెన్సెక్స్
Stock Markets
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది. సూచీలు రికార్డు గరిష్ఠ స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా బీఎస్‌ఈ సెన్సెక్స్  61 వేల పాయింట్ల ఎగువునకు చేరింది. ఉదయం 9.17 గం.ల సమయంలో సెన్సెక్స్ 388 పాయింట్ల లాభంతో 61,125 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ కూడా 118 పాయింట్ల లాభంతో 18,280 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. 1503 షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. 450 షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 86 షేర్ల విలువ యధాతథంగా ఉంది. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి.

ఉదయం 10 గం.లకు సెన్సె్క్స్ 367 పాయింట్ల లాభంతో 61,104 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 18,281 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితులకు తోడు.. భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) భారీ ఆశాజనక అంచనాలు వ్యక్తంచేయడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఐఎంఎఫ్ నివేదిక కారణంగా పారిశ్రామిక వర్గాల్లో ఉత్సాహం నెలకొంటోంది.

Also Read..

Viral Photos: వైన్‌తో నడిచే కారును మీరెప్పుడైనా చూశారా.? నెట్టింట ట్రెండింగ్.!

Rakul Preet Singh Marriage: బాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకుతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. వీడియో