AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: వినియోగదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. బ్యాంకు కీలక నిర్ణయం

కోట్లాది మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు పెద్ద వార్త ఉంది. ఎంసీఎల్‌ ఆర్‌ (MCLR -మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) రేటును ఎస్‌బీఐI పెంచింది. కొత్త రేట్లు జూలై 15, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో ఎస్‌బీఐ కస్టమర్ల EMI పెరుగుతుంది. ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ రేటును 0.10 శాతం పెంచింది...

SBI: వినియోగదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. బ్యాంకు కీలక నిర్ణయం
SBI
Subhash Goud
|

Updated on: Jul 16, 2024 | 12:25 PM

Share

కోట్లాది మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు పెద్ద వార్త ఉంది. ఎంసీఎల్‌ ఆర్‌ (MCLR -మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) రేటును ఎస్‌బీఐI పెంచింది. కొత్త రేట్లు జూలై 15, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో ఎస్‌బీఐ కస్టమర్ల EMI పెరుగుతుంది. ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ రేటును 0.10 శాతం పెంచింది.

కొత్త MCLR రేటు ఎంత?

ఎంసీఎల్‌ఆర్‌ పెరుగుదల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేస్ ల్యాండింగ్ రేటు 8.10 శాతం నుండి 9 శాతానికి పెరిగింది. రాత్రిపూట ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.10 శాతానికి చేరుకుంది. 1 నెల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.35 శాతం, 3 నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.40 శాతం, 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.75 శాతం, 1 సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.85 శాతంగా మారింది. అయితే, 1 సంవత్సరానికి ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.85 శాతం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు ఎంసీఎల్‌ఆర్‌ రేటు వరుసగా 8.95 శాతం, 9 శాతంగా ఉంది. 3 నెలలు, 6 నెలలు, 2 సంవత్సరాల రుణాలకు ఎంసీఎల్‌ఆర్‌ రేటు 0.10 శాతం పెంచింది.

ఇది కూడా చదవండి: Indian Railways: భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా? 4 రోజుల ప్రయాణం

ఎంసీఎల్‌ఆర్‌ రేటు ఎంత?

ఎంసీఎల్‌ఆర్‌ రేటు అనేది బ్యాంకు ఎవరికీ రుణం ఇవ్వలేని తక్కువ రేటు. చాలా రిటైల్ రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలు ఎంసీఎల్‌ఆర్‌ రేటుతో అనుసంధానించింది. రాబోయే కాలంలో EMIలో పెరుగుదల ఉండవచ్చు.

MCLR అంటే ఏమిటి?

ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించే కనీస రేటు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2016 సంవత్సరంలో ఎంసీఎల్‌ఆర్‌ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వివిధ రకాల రుణాల వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయి. బ్యాంకులు రుణాలను అందించడానికి ఇది అంతర్గత సూచన రేటు. బ్యాంక్ 30 సెప్టెంబర్ 2019 వరకు ఎంసీఎల్‌ఆర్‌ లింక్డ్ హోమ్ లోన్‌లను అందిస్తోంది. ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన తర్వాత ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్, ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటు లేదా బ్యాంకులకు స్వల్పకాలిక రుణాల రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.90 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది.

ఇది కూడా చదవండి: Relationship Tips: భార్యలు పుట్టింటికి వెళ్లిన తర్వాత భర్తలు ఎక్కువ ఆ పనే చేస్తారట!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..