Holi Offer On Iphone: హోలీకి ఐఫోన్‌ పై బంపరాఫర్‌.. ఏకంగా రూ. 13 వేల ఆదా.. ఎక్ఛ్సేంజ్‌తో మరో రూ. 3 వేలు..

|

Mar 25, 2021 | 2:43 PM

Holi Offer On Iphone: ఐఫోన్‌ కొనుగోలు చేయాలని చేయాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ధర విషయంలో యాపిల్‌ ఫోన్లు ఎక్కువగా ఉండడంతో వీటిని కొనుగోలు చేయడానికి దూరంగా ఉంటారు.  తాజాగా హోలీ పండగ..

Holi Offer On Iphone: హోలీకి ఐఫోన్‌ పై బంపరాఫర్‌.. ఏకంగా రూ. 13 వేల ఆదా.. ఎక్ఛ్సేంజ్‌తో మరో రూ. 3 వేలు..
Iphone 11 And 12 Mini
Follow us on

Holi Offer On Iphone: ఐఫోన్‌ కొనుగోలు చేయాలని చేయాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ధర విషయంలో యాపిల్‌ ఫోన్లు ఎక్కువగా ఉండడంతో వీటిని కొనుగోలు చేయడానికి దూరంగా ఉంటారు.  తాజాగా హోలీ పండగ సందర్భంగా ఆపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్‌పై భారీ ఆఫర్లు ప్రకటించారు. ఐఫోన్‌ 11, 12 మినిపై బంపరాఫర్‌ ప్రకటించింది.

ఐఫోన్‌ 11పై ఆఫర్లు..

పరిమిత కాల ఆఫర్‌ కింద ఐఫోన్‌ 11పై ఏకంగా రూ.13 వేలు తగ్గనుంది. ప్రస్తుతం ఐఫోన్‌ 11 ధర రూ. 54,900గా ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 5 వేలు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌కొనుగోలు చేస్తే రూ. 8000 విలువ చేసే యాక్ససరీస్‌ను ఉచితంగా పొందొచ్చు. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేస్తే అదనంగా మరో రూ. 3 వేల తగ్గింపు లభించనుంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ, 128 , 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో బ్లాక్, గ్రీన్, (ప్రొడక్ట్) రెడ్, పర్పుల్, ఎల్లో వైట్ అనే ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

ఐఫోన్‌ 11..

 

ఐఫోన్‌ 12 మినీపై ఆఫర్లు..

ఐఫోన్‌ 12 మినీపై కూడా యాపిల్‌ ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 6000 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌కొనుగోలు చేస్తే రూ. 8000 విలువ చేసే యాక్ససరీస్‌ను ఉచితంగా పొందొచ్చు. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేస్తే అదనంగా మరో రూ. 3 వేల తగ్గింపు లభించనుంది. ఐఫోన్‌ 12 మినీ ఫీచర్ల విషయానికొస్తే.. 64జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేష్‌ ఆప్షన్స్‌తో పాటు 4జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉన్నాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సి క్యాష్‌బ్యాక్ మార్చి 27 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం.

ఐఫోన్‌ 12..

Also Read: Realme 8 Pro: మార్కెట్‌లోకి రియల్‌మీ 8 సిరీస్‌ ఫోన్లు.. అద్భుత కెమెరా.. అదిరిపోయే ఫీచర్లు..

Smartphones Under 15000: రూ.15 వేలలోపు స్మార్ట్‌ఫోన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే ఓసారి వీటిపై లుక్కేయండి..

Microsoft New Plans: ప్రజల ధోరణిని పసిగట్టిన మైక్రోసాఫ్ట్.. కీలక నిర్ణయం.. మరి ఇదైనా సక్సెస్ అయ్యేనా..?