- Telugu News Photo Gallery Technology photos Microsoft plans to arrange own social media platform and messaging app
Microsoft New Plans: ప్రజల ధోరణిని పసిగట్టిన మైక్రోసాఫ్ట్.. కీలక నిర్ణయం.. మరి ఇదైనా సక్సెస్ అయ్యేనా..?
Microsoft New Plans: ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సొంతంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌ని తీసుకువచ్చేందుకు ప్లాన్స్ వేస్తోంది.
Updated on: Mar 24, 2021 | 6:47 AM

ప్రపంచ వ్యాప్తంగా యూజర్ల అభిప్రాయాలను గుర్తించిన అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆ దిశగా సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. సొంతంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌ని తీసుకువచ్చేందుకు ప్లాన్స్ వేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అడుగులు ముందుకు వేసిన మెక్రోసాఫ్ట్.. మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ డిస్‌కార్డ్ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది.

మెక్రోసాప్ట్ సొంతంగా మెసేజింగ్ యాప్‌ను తీసుకురావడం కోసం డిస్‌కార్డ్ ఇంక్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డీల్ విలు సుమారు వెయ్యి కోట్ల డాలర్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

డిస్‌కార్డ్ కూడా తమ సంస్థను అమ్మేందుకు సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్, డిస్‌కార్డ్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గతేడాది డిసెంబర్‌లో డిస్‌కార్డ్ వాల్యూ 700 కోట్ల డాలర్లుగా నిర్ణయించగా. ఇప్పుడు దాని విలువ 1000 కోట్ల డాలర్లకు చేరింది.

2016లో లింక్డ్ఇన్‌ను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్.. సొంతంగా సోషల్ మీడియా వేదికలను ఏర్పాటు చేసుకోవాలని బలంగా నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యాప్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోందని టాక్. ఇదిలా ఉంటే.. షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికా ఆస్తులను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ గట్టిగానే ప్రయత్నించింది. అయితే, ఏ కారణంగానో అది ఫలించలేదు.





























