Rice Export: సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం అనుమతి.. కారణం ఏంటంటే..
భారతదేశం, సింగపూర్ చాలా సన్నిహిత భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు అన్నీ పెనవేసుకుని ఉన్నాయి. ఈ ప్రత్యేక సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని సింగపూర్ ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారత్ నిర్ణయించిందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. దీనికి సంబంధించి..
భారతదేశంలో బియ్యం కొరత, ధరలను నివారించడానికి బియ్యం ఎగుమతి నిషేధంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే సింగపూర్‌కు మాత్రం మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సింగపూర్‌కు భారత్‌తో ఉన్న ప్రత్యేక సంబంధాల కారణంగా బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించనుంది. సింగపూర్ ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
భారతదేశం, సింగపూర్ చాలా సన్నిహిత భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు అన్నీ పెనవేసుకుని ఉన్నాయి. ఈ ప్రత్యేక సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని సింగపూర్ ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారత్ నిర్ణయించిందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు.
భారతదేశంలో ఆహార భద్రతను కాపాడేందుకు, పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి ముందుజాగ్రత్త చర్యగా, జూలై 20న కేంద్ర ప్రభుత్వం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. ఎగుమతి మాత్రం ఆగకుండా కనిపించింది. ఈ నేపథ్యంలో బాస్మతి మినహా అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బాస్మతి బియ్యం, బాయిల్డ్ రైస్‌కు ఇచ్చిన హెచ్‌ఎస్ కోడ్ ప్రకారం.. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతి అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆగస్టు 27న బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బియ్యం ఉత్పత్తి, ఎగుమతి చేసే ప్రధాన దేశాలలో భారతదేశం కూడా ఒకటి. భారత ప్రభుత్వ బియ్యం నిషేధం, నిషేధ చర్యల కారణంగా అనేక దేశాలలో ఆహార ధరలు హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు భారతీయ బియ్యంపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్‌కు బియ్యం ఎగుమతి చేసేందుకు భారత్ మినహాయింపు ఇచ్చింది. ఇతర దేశాలు ఇలాంటి మినహాయింపు కోరే అవకాశం లేదు. భారత్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఈ నిషేధం నిర్ణయం తీసుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి