AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: సెన్సెక్స్ 75,000 మార్క్‌ను చేరుతుందా.. ఈ సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్‌ ఎలా ఉండబోతుంది..

ఉక్రెయిన్ సంక్షోభం(Russia Ukraine War) కారణంగా స్టాక్ మార్కెట్(Stock Market) ఎంత వేగంగా పడిందో.. అంతే వేగంగా కోలుకుంటోంది...

Stock Market: సెన్సెక్స్ 75,000 మార్క్‌ను చేరుతుందా.. ఈ సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్‌ ఎలా ఉండబోతుంది..
Stock Market
Srinivas Chekkilla
|

Updated on: Mar 12, 2022 | 3:30 PM

Share

ఉక్రెయిన్ సంక్షోభం(Russia Ukraine War) కారణంగా స్టాక్ మార్కెట్(Stock Market) ఎంత వేగంగా పడిందో.. అంతే వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుత పరిస్థితిని పెట్టుబడిదారులు అర్థంచేసుకోలేకపోతున్నారు. మార్కెట్‌లో ఏ స్థాయిలో షేర్లు కొనుగోలు చేయాలో, ఎప్పుడు అమ్మాలో తెలియక తికమకపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొవడానికి గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ(Morgan stanly) స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ప్రత్యేక చిట్కాలు ఇచ్చింది. పెట్టుబడిదారులు ఇప్పుడు బార్‌బెల్ వ్యూహాన్ని అనుసరించాలని పేర్కొంది. ఈ వ్యూహంలో అధిక రిస్క్, రిస్క్ లేని స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం మంచిదని.. మితమైన రిస్క్, మితమైన రాబడి ఉన్న స్టాక్‌లలో పెట్టుబడి పెట్టకపోవడమే ఉత్తమమని పేర్కొంది.

ముడి చమురు చరిత్రలో పెరిగినప్పటికీ, భారత మార్కెట్ పనితీరు బాగానే ఉందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. దేశీయ ఇన్వెస్టర్ల సహకారం ఎక్కువగా ఉందని చెప్పింది. గత ఆరు నెలల నుంచి ఎఫ్‌పిఐలు అమ్మకాలు జరుపుతుండగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా అదే వేగంతో కొనుగోళ్లు జరుపుతున్నారు. చమురు ధర ఆధారంగా, భారతీయ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బేర్ మార్కెట్లో ఉందని బ్రోకరేజ్ చెబుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును పెంచితే, దాని ప్రభావం మార్కెట్‌పై కూడా కనిపిస్తుంది. 2022 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ పనితీరుకు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ తన పాత అంచనాను సవరించింది. డిసెంబర్ 2022 నాటికి, సెన్సెక్స్ ప్రస్తుత స్థాయితో పోలిస్తే 16 శాతం పెరిగి మళ్లీ పాత స్థాయి 62 వేలకు చేరుకోవచ్చని అంచనా. అయితే.. ఇది గత అంచనా కంటే 11 శాతం తక్కువ.

మార్కెట్లో మళ్లీ బుల్ రన్ ప్రారంభమైతే.. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 75 వేల స్థాయికి చేరుకోవచ్చు. 80 వేలకు చేరుతుందని పాత అంచనా. బుల్ మార్కెట్‌ రావాలంటే.. కరోనా కొత్త వేవ్ రాకూడదు. ఉక్రెయిన్ సంక్షోభం త్వరగా పరిష్కారం కావాలి. ఆర్బీఐ వడ్డీ రేటు పెంపు నిర్ణయం తీసుకోకూడదు. ఇలా జరిగితేనే.. స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ రన్ ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

ప్రస్తుతం హెల్త్‌కేర్ ఒత్తిడిలో ఉందని.. అయితే టెక్నాలజీ రంగం విజృంభిస్తుందన్నారు. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చని సూచించింది. టాటా స్టీల్, ఎన్‌టిపిసిని దూరం పెట్టాలని చెప్పింది.

Note: ఇది కేవలం బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ, అంచనా మాత్రమే.. మీరు స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి.. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం.

Read Also.. EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్‌.. 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గిన పీఎఫ్ వడ్డీ రేటు..!