స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. అయితే కాసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కొన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో కోలుకున్న మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అవగా.. నిఫ్టీ 11,600 మార్క్‌ పైన కదలాడింది. అయితే చివర్లో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో […]

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 12, 2019 | 4:46 PM

దేశీయ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. అయితే కాసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కొన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో కోలుకున్న మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అవగా.. నిఫ్టీ 11,600 మార్క్‌ పైన కదలాడింది. అయితే చివర్లో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 87 పాయింట్ల నష్టంతో 38,736 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 11,552 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.62గా కొనసాగుతోంది.

ఎన్ఎస్‌ఈలో వేదాంత లిమిటెడ్‌, సన్‌ఫార్మా, టాటాస్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. విప్రో, ఓఎన్జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నష్టపోయాయి.