Small Savings Scheme: సామాన్యులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ పెంపు.. ఎంత పెరిగిదంటే..
సామాన్యులకు మోదీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా చిన్న పొదుపు పథకాలపై పెట్టుబడి పెడితే అధిరిపోయే రాబడి ఉంటుందని ప్రకటించింది. ఇప్పుడు మీరు పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ వడ్డీని పొందుతారు. నిజానికి మోదీ ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును 70 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.
ఇప్పుడు మీరు పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. వాస్తవానికి, మోదీ ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును 70 బేసిస్ పాయింట్లు అంటే 0.70 శాతం వరకు పెంచింది. ఈ పెరుగుదల ఏప్రిల్ నుంచి జూన్ 2023 త్రైమాసికంలో జరిగింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు అంటే మార్చి 31, 2023న ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటు పెరిగింది.
కొత్త వడ్డీ రేట్లు ఏంటి?
పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. అదే సమయంలో 1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు ఇప్పుడు 6.6 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. కాగా, 2 సంవత్సరాల పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ 6.8 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగింది.
మరోవైపు, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ 3 సంవత్సరాల కాలవ్యవధితో ఇప్పుడు సంవత్సరానికి 6.9 శాతానికి బదులుగా 7.0 శాతం వడ్డీని పొందుతుంది. 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.0 శాతం నుండి 7.5 శాతానికి పెరిగింది. పోస్టాఫీసులోని ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే కస్టమర్లకు 5.8 శాతానికి బదులుగా 6.2 శాతం వడ్డీ లభిస్తుంది.
The rates of interest on various Small Savings Schemes for the first quarter (Q1) of financial year 2023-24 starting from 1st April, 2023 and ending on 30th June, 2023 have been revised as follows? pic.twitter.com/OwLr8MxhGU
— Ministry of Finance (@FinMinIndia) March 31, 2023
మరోవైపు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వారికి వడ్డీ 8.0 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. మరోవైపు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో వడ్డీ రేటును 7.1 శాతం నుంచి 7.4 శాతానికి పెంచారు. అయితే, ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అంటే ఎన్‌ఎస్‌సిపై వడ్డీ రేటును 7.0 శాతం నుంచి 7.7 శాతానికి పెంచింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం