SBI Customer Alert: స్టేట్ బ్యాంక్ వినియోగదారులకు అలెర్ట్.. 45 నిమిషాలు సేవలకు అంతరాయం.. ఎప్పుడంటే..?

SBI Online Banking Services: ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రస్తుతం ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు బయటకు

SBI Customer Alert: స్టేట్ బ్యాంక్ వినియోగదారులకు అలెర్ట్.. 45 నిమిషాలు సేవలకు అంతరాయం.. ఎప్పుడంటే..?
SBI Customer Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 18, 2021 | 8:39 PM

SBI Online Banking Services: ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రస్తుతం ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఎక్కువగా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి అవసరమైన వస్తువులను ఇంటినుంచే పొందుతూ.. ఆన్‌లైన్‌లోనే నగదును చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో పలు బ్యాంకులు కూడా తమ సేవలను సులభతరం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కూడా సేవలను సులభతరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ఎస్‌బీఐ సేవలు శనివారం అర్థరాత్రి 40 నిమిషాల పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. జూన్ 20 (శనివారం అర్ధరాత్రి) ఒంటిగంట నుంచి 1.40 నిమిషాల వరకూ ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయని పేర్కొంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్ గ్రేడేషన్ మెయింటెనెన్స్ సర్వీసులో భాగంగా ఇటీవల కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. కస్టమర్ లకు మెరుగైన సేవలను అందించేందుకు ఈ అప్‌గ్రెడేషన్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి.. తాము చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకొని.. ఖాతాదారులు తమకు సహకరించాలని ఎస్బీఐ కోరింది. ఈ 40 నిమిషాల వ్యవధిలో ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్/యుపీఐ సేవలు పనిచేయవని స్పష్టంచేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతోంది. దీని నెట్ వర్క్ పరిధిలో 22,000 బ్రాంచీలు, 58,500 ఎటిఎమ్‌లు, 66,000 బీసీ అవుట్ లెట్‌ల ద్వారా 44 కోట్ల మంది ఖాతాదారులకు సేవలందిస్తోంది.

Also Read:

Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో మరొకరితో సరదాగా భర్త.. అది చూసిన భార్య ఒక్కసారిగా ఏం చేసిందంటే..

COVID Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పురుషులలో పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుతుందనేది అపోహ.. తేల్చిచెప్పిన అధ్యయనాలు!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే