Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో మరొకరితో సరదాగా భర్త.. అది చూసిన భార్య ఒక్కసారిగా ఏం చేసిందంటే..

Viral Video: భార్యాభర్తల మధ్య అనేక తగాదాలు చోటు చేసుకుంటాయి. అయితే, ఎన్ని తగాదాలు ఉన్నా అవి కొంతకాలం మాత్రమే.. ఆ తరువాత...

Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో మరొకరితో సరదాగా భర్త.. అది చూసిన భార్య ఒక్కసారిగా ఏం చేసిందంటే..
Funny Video
Follow us

|

Updated on: Jun 18, 2021 | 7:44 PM

Viral Video: భార్యాభర్తల మధ్య అనేక తగాదాలు చోటు చేసుకుంటాయి. అయితే, ఎన్ని తగాదాలు ఉన్నా అవి కొంతకాలం మాత్రమే.. ఆ తరువాత ఇద్దరూ కలిసిపోయి సంతోషంగా జీవనం సాగిస్తుంటారు. అయితే, ఈ ఇద్దరి మధ్య ఎన్ని జరిగినా ఓకే.. కానీ, మధ్యలో ఎవరైనా తలదూర్చారో అంతే సంగతలు ఇక. ముఖ్యంగా దంపతుల్లో భార్య.. తన భర్తతో మరొక మహిళ ఉండటాన్ని ఎంతమాత్రం సహించదు. పొరపాటున తన భర్తతో ఎవరైనా మహిళ సన్నిహితంగా ఉన్నట్లు గమనించారే అనుకోండి.. ఇక అంతే సంగతులు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో ఓ భార్య అడ్డంగా పప్పులో కాలు వేసి.. ఆ తరువాత నాలుక కరుచుకుంది. కడుపుబ్బా నవ్వు పుట్టిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా హల్‌చల్ చేస్తోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తి స్విమ్మింగ్ పూల్‌లో మరొకరితో సరదాగా గడుపుతున్నాడు. అంతలోనే స్వి్మ్మింగ్ పూల్ వద్దకు వచ్చిన ఆ వ్యక్తి భార్య.. వారిద్దరినీ గమనించి ఆగ్రహానికి గురైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోపంతో లేచి స్విమ్మింగ్ పూల్‌లోకి దిగింది. తన భర్త పక్కనున్న వ్యక్తి జుట్టును పట్టునుకు ఒక్క ఉదుటున వెనక్కి లాగింది. అలా వెనక్కి మళ్లిన వ్యక్తి మొహం చూసి బిత్తరపోవడం ఆ భార్య వంతు అయ్యింది. కారణం.. తన భర్త పక్కనున్న వ్యక్తి మరో పురుషుడే కావడం. తన భర్త పక్కన ఉన్న వ్యక్తికి పొడవాటి జుట్టు ఉంది. దాంతో అక్కడ ఉన్నది మహిళ అని పొరబడిన భార్య.. ఆగ్రహంతో ఇలా చేసింది. చివరికి వాస్తవం తెలిసి షాక్ అయ్యింది. మహిళ చేసిన పని చూసి అక్కడ ఉన్నవారు కూడా కడుపుబ్బా నవ్వుకున్నారు. అయితే, అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను అంతా వీడియో కెమెరాలో రికార్డ్ చేశారు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడది నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

TTD Chairman YV Subba Reddy: ఈనెల 21తో ముగియనున్న టీటీడీ ఛైర్మన్ పదవీకాలం.. మరోసారి వైవీ సుబ్బారెడ్డికే ఛాన్స్?