Samsung: ప్రస్తుతం మార్కెట్లో రోజురోజుకు కొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు ప్లాట్‌గా ఉంటూ వచ్చిన స్మార్ట్‌ఫోన్లు మరింత సౌకర్యంగా మారిపోనున్నాయి. జేబులో ఇమిడిపోయేలా వాటిని తయారు చేస్తోంది శాంసంగ్ కంపెనీ. మడతపెట్టడానికి వీలుగా తయారు చేసిన రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మోడళ్లను త్వరలో మార్కెట్‌లో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకు ముహుర్తం కూడా ఖరారు చేసింది. మొబైల్ ఫోన్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోన్న శాంసంగ్ తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంటోంది.
ఈ క్రమంలోనే… ఫోల్డబుల్, ఫ్లిప్ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ కంటే ముందు.. ఫోల్డబుల్ ఫోన్లను పరిచయం చేసింది కూడా శాంసంగ్ కంపెనీయే. దానిని స్మార్ట్‌ఫోన్లకూ విస్తరింపజేసింది. గెలాక్సీ సిరీస్‌లోనే కొత్త ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్లను తయారు చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్3) మోడళ్లను మార్కెట్లోకి తీసుకుని రానుంది. ఆగస్టు 11 న ఈ రెండు మోడళ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది.
కాగా, ఈ రెండు ఫోన్‌లతో పాటు కొన్ని విడి పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను రూపొందించడం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తేమీ కాదు గానీ.. వాటి ‘ధర’ విషయంలోనే తేడాలుంటూ వచ్చాయి. రెండు సంవత్సరాల క్రితం విడుదల చేసిన శాంసంగ్ జెడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌పోన్ ధర రూ. లక్ష పైమాటే. ఇప్పుడు కొత్తగా తయారు చేసిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 మోడల్ ధర పాత హ్యాండ్‌సెట్ కంటే 22 శాతం తక్కువగా ఉండే అవకాశముందని దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.