Old Notes Sale: ఆ నెంబర్‌తో ఉన్న పాత రూ. 10 నోట్ ఉంటే.? రూ. 5 లక్షలు మీ సొంతమైనట్లే!

Old Notes Sale: కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమంది తాము భద్రపరుచుకున్న..

Old Notes Sale: ఆ నెంబర్‌తో ఉన్న పాత రూ. 10 నోట్ ఉంటే.? రూ. 5 లక్షలు మీ సొంతమైనట్లే!
10 Ruppees
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 19, 2021 | 8:32 AM

కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమంది తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఇలాంటి పాత నాణేలను, నోట్లను అమ్మడానికి చాలానే వెబ్‌సైట్స్ ఆన్లైన్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మీ దగ్గర 786 నెంబర్ కలిగిన రూ. 10 పాత నోట్ ఉంటే.. మీరు లక్షాధికారి అయినట్లే. ఆ నోట్లను e-bay వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి పెట్టవచ్చు. పాత నోట్లను క్లిక్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా అమ్మవచ్చు. 786 నెంబర్ కలిగిన రూ. 10 నోట్‌తో మీకు రూ.5 లక్షల వరకు సంపాదించే అవకాశం లభిస్తుంది, అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఆన్‌లైన్ వేలం కోసం మీరు మొదటిగా మీ దగ్గర ఉన్న రూ. 10 నోట్ ఫోటో తీసుకుని.. దానిని క్లిక్ ఇండియా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ సైట్‌లో మీరు అమ్మకపుదారుడిగా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. దీనితో ఆ నోట్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్న వ్యక్తులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు. నచ్చినవారు తమకు తోచిన మొత్తాన్ని కోట్ చేస్తారు. ఇక ఒకవేళ పోటీదారుల సంఖ్య పెరిగితే మాత్రం మీరు జాక్‌పాట్ కొట్టినట్లే. అవన్నీ కూడా లక్షల్లో అమ్ముడైపోతాయి. కాగా, మీ దగ్గర 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లు 786 నెంబర్‌తో ఉన్నట్లయితే.. మీరు లాటరీని గెలుచుకున్నట్లే. మీరు ఈ నోట్లను e-bay వెబ్‌సైట్‌లో అమ్మవచ్చు. అరుదైన నోట్ల వేలం e-bay వెబ్‌సైట్‌లో తరచూ జరుగుతుంటుంది. ఈ ఆన్‌లైన్ వేలంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనవచ్చు.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!

చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!