Business Idea: సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల రూ. 30 వేలు జేబులోకి.!

ఉద్యోగం చేసి బోర్ కొట్టిందా.? సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని చూస్తున్నారా.! అయితే మీకోసం ఓ బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని సంపాదించవచ్చు. ప్రతీ నెల సైడ్ ఇన్‌కమ్ కింద కొంత డబ్బును మీ జేబులోకి వేసుకోవచ్చు. మరి అదేంటో ఓ సారి చూసేద్దాం.

Business Idea: సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల రూ. 30 వేలు జేబులోకి.!
Money

Updated on: Jan 18, 2026 | 7:34 AM

సమోసాల బిజినెస్‌తో ప్రతీ నెలా మంచి రాబడిని జేబులోకి వేసుకోవచ్చు. రోజుకు 200 సమోసాలు అమ్మితే.. సంవత్సరానికి రూ 3.60 లక్షల వరకు సంపాదించవచ్చని అంచనా. మార్కెట్ పరిస్థితులు, మన మార్కెటింగ్ లాంటి అంశాలు కలిస్తే.. ఈ లాభాలు మరింతగా పెరగవచ్చు. వివరాల్లోకి వెళ్తే..! చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునేవారికి ఈ సమోసా బిజినెస్ బెస్ట్ ఆప్షన్. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయ అవకాశాలను సృష్టించగలదు. ఓ సమోసా రూ. 10కి అమ్మితే.. రోజుకు 200 సమోసాలను అమ్మిన్నట్లయితే రోజువారీ ఆదాయం రూ. 2 వేల వరకు వస్తుంది.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

ఇక ఖర్చులు రోజుకు రూ. వెయ్యి తీసేయగా.. రోజువారీ నికర ఆదాయం రూ. వెయ్యి వస్తుంది. ఈ లెక్కన, నెలకు రూ. 30 వేలు, సంవత్సరానికి రూ 3.60 లక్షలుగా అంచనా వేయొచ్చు. అయితే మన మార్కెటింగ్, అలాగే స్థానికంగా షాప్‌లతో లింకప్, అలాగే క్వాలిటీ లాంటివి మైంటైన్ చేస్తే.. కచ్చితంగా మన లాభం మరింతగా పెరుగుతుంది. అటు ఫుడ్ బిజినెస్‌పై దృష్టి పెట్టినవారు ఓ మొబైల్ టిఫిన్ సర్వీస్ లాంటిది కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుడ్ బిజినెస్ చాలా బెస్ట్. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి ఫుడ్ కోసం అందరూ తాపత్రయపడుతుంటారు. అందుకే అలాంటివారి కోసం హోమ్లీ ఫుడ్ పార్శిల్ సర్వీస్ స్టార్ట్ చేస్తే.. మంచి లాభాలు ఆర్జించవచ్చు. కావాలంటే ఫుడ్ యాప్స్ జోమాటో, స్విగ్గి లాంటి వాటితో కూడా లింకప్ కావచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి