Salary Flexibility: ప్రతి ఉద్యోగికి అదే సమస్య.. జీతంతో జీవితం మారుతుందా..?
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు సగటు ఉద్యోగికి ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పోలిస్తే జీతం పెరుగేదల అనేది చాలా తక్కువుగా ఉంటుంది. దీన్ని వల్ల ప్రతి ఉద్యోగి కుటుంబం గడవక ఇబ్బందులు పడుతూ ఉంటారు. భారతీయ కార్మికులు పెరుగుతున్న జీవన వ్యయాలను ఎదుర్కోవడంతో పాటు నలుగురి గౌరవం కోసం అధిక జీతాలతోనే సాధ్యం అని నమ్ముతున్నారు. మెజారిటీ ఉద్యోగులకు సంపాదన లేమి అనేది ఒక క్లిష్టమైన సమస్యగా మిగిలిపోయిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు సగటు ఉద్యోగికి ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పోలిస్తే జీతం పెరుగేదల అనేది చాలా తక్కువుగా ఉంటుంది. దీన్ని వల్ల ప్రతి ఉద్యోగి కుటుంబం గడవక ఇబ్బందులు పడుతూ ఉంటారు. భారతీయ కార్మికులు పెరుగుతున్న జీవన వ్యయాలను ఎదుర్కోవడంతో పాటు నలుగురి గౌరవం కోసం అధిక జీతాలతోనే సాధ్యం అని నమ్ముతున్నారు. మెజారిటీ ఉద్యోగులకు సంపాదన లేమి అనేది ఒక క్లిష్టమైన సమస్యగా మిగిలిపోయిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ఓ నివేదిక ప్రకారం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఫ్లెక్సిబిలిటీ ఒక ముఖ్యమైన సమస్యగా మారింది. వ్యాపార అవసరాలతో పాటు ఉద్యోగి ప్రాధాన్యతలు రెండింటికి అనుగుణంగా హైబ్రిడ్ వర్క్ మోడల్‌లు, విధానాలను అమలు చేయడంలో యజమానులు సవాళ్లను ఎదుర్కొంటున్నారని నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉద్యోగులు కోరుకుంటున్న అంశాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఇటీవల ఓ కంపనీ 37 దేశాల్లోని 50,000 మంది నైపుణ్యం కలిగిన వైట్ కాలర్ నిపుణుల నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. ఇందులో భారతదేశం నుంచి 3,000 మందికి పైగా పాల్గొన్నారు. 2024లో 94 శాతం మంది భారతీయ ఉద్యోగులు కొత్త ఉద్యోగాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నారని తేలింది. అందువల్ల యజమానులు పోటీ వేతనాలకు మించి వెళ్లాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. అత్యుత్తమ ప్రతిభను విజయవంతంగా ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి సానుకూల ఆపీస్ కల్చర్‌ను పెంపొందించడంతో పాటు వారి నైపుణ్యత, వైవిధ్యం, ఈక్విటీ వంటి విస్తృత అంశాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది. ముఖ్యంగా రిక్రూట్‌మెంట్ వ్యూహం కేవలం పోటీ వేతనాలను అందించడం కంటే ఎక్కువ అవసరని నిపుణులు వివరిస్తున్నారు. ఇది బలమైన కంపెనీ సంస్కృతిని పెంపొందించడంతో పాటు మరియు అగ్రశ్రేణి ప్రతిభను సమర్థవంతంగా ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు.
కార్యాలయ వివక్షను నివేదించడంలో భారతదేశం ఏపీఏషీ ముందుంది. 47 శాతం మంది ఉద్యోగులు కార్యాలయ వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏపీఏసీ కంటే సగటు 31 శాతం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ 45 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికీ ఇలాంటి సంఘటనలను అధికారికంగా నివేదించడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 28 శాతం సంస్థలు ఇలాంటి నిలుపుదల సవాళ్లను నివేదించాయి. ఇది భారతీయ కంపెనీలపై అధిక ఒత్తిడిని సూచిస్తుంది. అన్ని వయస్సుల మధ్య ఉన్నత స్థాయి ఉద్యోగ సంతృప్తిని కొనసాగించడానికి సంస్థలు విభిన్న ప్రాధాన్యతలను అర్థం చేసుకుని పరిష్కరించాలని వెల్లడిస్తున్నాయి. వివిధ రంగాలలో 26 శాతం మంది భారతీయ యజమానులు రిక్రూట్‌మెంట్ సవాళ్లను నివేదించగా 25 శాతం మంది నిలుపుదలలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగంలోని 31 శాతం సంస్థలు రిక్రూట్‌మెంట్ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..