AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: బంగారాన్ని క్యాష్‌ పెట్టి కొనొచ్చా? చాలామందికి తెలియని రూల్స్ ఇవే!

పండుగ సీజన్ లో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటారు. అయితే బంగారం కొనే విషయంలో కొన్ని ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ గురించి తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అసలు బంగారాన్ని క్యాష్ పెట్టి కొనొచ్చా? కొంటే ఎంతవరకూ లిమిట్ ఉంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Rates: బంగారాన్ని క్యాష్‌ పెట్టి కొనొచ్చా? చాలామందికి తెలియని రూల్స్ ఇవే!
Gold Rates Rules
Nikhil
|

Updated on: Oct 13, 2025 | 5:38 PM

Share

బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు చాలామంది క్యాష్ తో పేమెంట్ చేస్తారు. చిన్న చిన్న దుకాణాల వాళ్లు వాటిని తెలియక యాక్సెప్ట్ చేస్తుంటారు. అయితే ఇలా బంగారాన్ని ఫిజికల్ క్యాష్ తో కొంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.  రిజర్వ్ బ్యాంక్, ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌ ప్రకారం బంగారాన్ని ఎలా కొనాలంటే.

లిమిట్ ఎంతంటే..

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బంగారాన్ని క్యాష్ పెట్టి కొనడానికి లిమిట్ రూ. 2 లక్షలు మాత్రమే. అంటే రూ. 2 లక్షలకు మించి విలువైన బంగారం కొనాలనుకుంటే కచ్చితంగా డిజిటల్ లేదా బ్యాకింగ్ మార్గాల ద్వారా పేమెంట్ చేయాలి. రూ. 2 లక్షల కంటే తక్కువ విలువ చేసే బంగారు ఆభరణాలను క్యాష్ రూపంతో కొనుక్కోవచ్చు.

పాన్ తప్పనిసరి

ఇక మరో రూల్ ఏంటంటే.. రూ. 50 వేల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డు డీటెయిల్స్ ఇవ్వడం తప్పనిసరి. బ్లాక్ మనీ వంటి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ రూల్ తెచ్చింది. రూ. 50 వేలకు మించి విలువైన బంగారాన్ని కొనేటప్పుడు పాన్ కార్డు నెంబర్ నమోదు చేయడం ద్వారా ఆ లావాదేవీ ఎవరు చేశారు అన్న లెక్కలు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు చేరతాయి. తద్వారా మీకు సమస్య లేకుండా ఉంటుంది.

ఇంట్లో ఎంత బంగారం..

ఇకపోతే ఇంట్లో ఉంచుకునే బంగారంపై కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత మహిళలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారం తమ దగ్గర ఉంచుకోవచ్చు. ఈ లిమిట్ దాటితే ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..