Royal Enfield EV: ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలోకి ‘రాయల్’ ఎంట్రీ.. లాంచింగ్ ఎప్పుడంటే..
యూత్ క్రేజీ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తోంది. ఈవీ సెగ్మెంట్ లో తన కొత్త వాహనాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది.

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే.. భయపెడుతున్న ఇంధన ధరలు.. ఆందోళన రేకెత్తిస్తున్న పర్యావరణ కాలుష్యం.. విద్యుత్ వాహనాలకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న తీరు అంతా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను విద్యుత్ శ్రేణిలో తీసుకొస్తున్నాయి. కార్లు, బైక్ లు, స్కూటర్లు, సైకిళ్లు ఇలా అన్నీ విద్యుత్ శ్రేణిలోనే తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కొత్తకొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో యూత్ క్రేజీ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తోంది. ఈవీ సెగ్మెంట్ లో తన కొత్త వాహనాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. మరో ఏడాదిలోపు కొత్త ఎలక్ట్రిక్ బైక్ తయారీ పూర్తయ్యే అవకాశం ఉంది. 2024 చివరి నాటికి రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ రోడ్లపై తిరిగే అవకాశం ఉంది.
చర్యలు ప్రారంభం..
విద్యుత్ శ్రేణి వాహనాలను తయారు చేయాలని భావిస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీటీఓ ఉమేష్ కృష్ణప్పను తమ బోర్డులోకి తీసుకుంది. అలాగే మన దేశంతో పాటు యూకే లో ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బిజినెస్ డెవలప్ మెంట్ కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
150 మిలియన్ డాలర్ల పెట్టుబడి..
రాయల్ ఎన్ ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహనం కోసం భారీగానే ఖర్చుచేస్తోంది. దాదాపు 150 మిలియన్ డాలర్లను దీని కోసం పెట్టుబడి పెట్టేందుకు సమాయత్తమవుతుంది. ఏడాదికి 1.2 లక్షల నుంచి 1.8 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసి ముందుకు వెళ్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోటో టైప్.. మరో 12 నెలల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత దానిలోని లోటుపాట్లు అంచనావేసి వాహనాల తయారీ ప్రారంభిస్తామని ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా 2024లో తమ తొలి విద్యుత్ శ్రేణి వాహనాన్ని రోడ్లపై తిరిగేలా రాయల్ ఎన్ ఫీల్డ్ పట్టుదలతో పనిచేస్తోంది.



స్పెసిఫికేషన్లు..
ఈ బైక్ లో ఫ్లక్స్ మోటార్, 1డీ థెర్మల్ మోడల్, వ్యాలిడేషన్ తో కూడిన బ్యాటరీ ప్యాక్, ఐఎస్ఓ26262 సేఫ్టీ మోడల్ గైడ్ లైన్స్ అమలు చేస్తూ.. జీటీ స్యూట్, సిమూలింక్, అమెసిమ్, రేంజ్, యాక్సెలరేషన్ వచ్చేలా అధునాతన ఫీచర్లతో బైక్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..