Credit Card Limit: క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎలా పెంచుకోవాలో తెలియడం లేదా.? ఈ టిప్స్ మీ కోసమే..
ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. క్రెడిట్ కార్డు ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగులు చేసే వారి నుంచి వ్యాపారాలు చేసే వారి వరకు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు సైతం క్రెడిట్ కార్డులను పెద్ద ఎత్తున...

ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. క్రెడిట్ కార్డు ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగులు చేసే వారి నుంచి వ్యాపారాలు చేసే వారి వరకు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు సైతం క్రెడిట్ కార్డులను పెద్ద ఎత్తున ఇస్తున్నాయి. రివార్డు పాయింట్స్ మొదలు నో కాస్ట్ ఈఎంఐ వరకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉండడంతో చాలా మంది వినయోగదారులు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారికి ఉండే ప్రధాన సమస్యల్లో క్రెడిట్ లిమిట్ ఒక ప్రధాన సమస్యగా చెప్పొచ్చు.
కొందరికి క్రెడిట్ కార్డు తొలుత వచ్చినప్పుడు ఎంత లిమిట్ ఉంటుందో అందే కంటిన్యూ అవుతుంది. ఎన్ని రోజులైనా లిమిట్ పెరగదు. ఇంతకీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఎలా పెంచుకోవాలి. అసలు లిమిట్ పెంపు కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మీరు ఒక క్రెడిట్ కార్డును సక్రమంగా ఉపయోగిస్తుంటే బ్యాంకులే మిమ్మల్ని క్రెడిట్ కార్డు లిమిట్ పెంచడానికి అప్రోచ్ అవుతుంటాయి. అలా లేని పరిస్థితుల్లో కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా సదరు బ్యాంకు వారు మునపటి లిమిట్ కంటే ఎక్కువ లిమిట్‌తో కార్డును అందిస్తారు.
అంతేకాకుండా దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు సేవల కోసం ప్రత్యేకంగా యాప్ సేవలను అందిస్తున్నాయి. యాప్స్‌లోనే కొన్నిసార్లు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. వీటిని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ క్రెడిట్ లిమిట్ పెంచుకునే అవకాశం ఉంటే వెంటనే దానిపై క్లిక్ చేసి సంబంధిత వివరాలను ఎంటర్ చేస్తే సరిపోతుంది. వెంటనే బ్యాంకు మీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుతుంది. అయితే బ్యాంకులు క్రెడిట్ లిమిట్‌ను పెంచే క్రమంలో పలు రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. వాటిలో ప్రధానమైనవి సిబిల్ స్కోర్.. ఈ స్కోర్ సరిగ్గా ఉండాలంటే కచ్చితంగా సమయానికి పేమెంట్ చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..