Valentine’s Day offer: ఐ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. రూ. 11,000 వరకూ తగ్గింపు.. వివరాలు ఇవి..
వారి కోసం ప్రత్యేకంగా ఇమాజిన్ ఆన్ లైన్ స్టోర్స్ (Imagine stores)అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై యాపిల్ బ్రాండ్ కు సంబంధించిన పలు రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ తో పాటు, ఎక్స్ఛేంజ్, క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది.

ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న వాలెంటైన్స్ డే సమీపిస్తోంది. నేటి నుంచే వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ఈ వారం రోజుల్లో వివిధ రూపాలలో ప్రేమికులు వారి ప్రేమను ఒకరికొకరు తెలుపుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో పలు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రేయసి/ప్రియుడికి యాపిల్ ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అందుకే, వారి కోసం ప్రత్యేకంగా ఇమాజిన్ ఆన్ లైన్ స్టోర్స్ (Imagine stores)అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై యాపిల్ బ్రాండ్ కు సంబంధించిన పలు రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ తో పాటు, ఎక్స్ఛేంజ్, క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. యాపిల్ సరికొత్త మోడల్ ఐఫోన్ 14 పై కూడా ఆఫర్లను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధర..
మన దేశంలో బేస్ మోడల్ యాపిల్ ఐఫోన్ 14 ధర రూ. 79,900 ఉంది. ఇమాజిన్ స్టోర్స్ దీనిపై రూ, 6000 డిస్కౌంట్ తో పాటు హెచ్ డీ ఎఫ్ సీ కార్డు ఉన్న వారికి 14 శాతం వరకూ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మొత్తం దీని ధర లో దాదాపు రూ. 10,000 తగ్గి.. వినియోగదారులకు కేవలం రూ. 69,900కు వస్తుంది. అలాగే ఐఫోన్ 14 ప్లస్ కూడా తక్కవ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ పై ఇమాజిన్ సైట్ లో రూ. 7,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ తో పాటు హెచ్డీ ఎఫ్ సీ బ్యాంకు కార్డులపై రూ. 4,000 వరకూ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. దీని సాధారణ ధర రూ. 89,900 ఉండగా.. మొత్తం డిస్కౌంట్లతో రూ. 78,900 లకు వస్తుంది.
ఐ ఫోన్ 14 ప్రో, ఐ ఫోన్ 14 ప్రో మ్యాక్స్ పై డీల్స్ ఇలా..
యాపిల్ కు చెందిన ప్రో మోడల్స్ ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కూడా డిస్కౌంట్ పై లభిస్తోంది. ఐ ఫోన్ 14 ప్రో ధర మన దేశంలో రూ. 1,29,900 ఉండగా.. ఐ ఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,39,900 ఉంది. వీటిపై ఇన్ స్టంట్ డిస్కౌంట్లు వరుసగా రూ 1,500, రూ, 3000 లతో పాటు హెచ్ డీఎఫ్ సీ క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ప్రో రూ. 1,25,400, ప్రో మ్యాక్స్ రూ. 1,35,400 లకు లభిస్తోంది.



ఐ ఫోన్ 14 సిరీస్ ఫోన్లు గతే డాది సెప్టెంబర్ లోనే యాపిల్ సంస్థ మార్కెట్లోకి లాంచ్ చేసింది. వీటిలో ఆకర్షణీయ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డైనమిక్ ఐల్యాండ్, ఏ 16 బయోనిక్ చిప్ సెట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ను ఆవిష్కరించేందుకు అం త సిద్ధం చేసుకుంటోంది. అన్నీ కుదిరితే 2023 సెకండ్ క్వార్టర్ లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్/ అల్ట్రా మోడళ్లను లాంచ్ చేసే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..




