AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్ ఎంతో తెలుసా?

ముఖ్యంగా రైతులు ఈ లోన్లను ఎక్కువగా తీసుకుంటారు. అలాగే వ్యాపారం చేయాలనుకునే వారితో, మరింత వృద్ధిలోకి తీసుకురావాలనుకును వారు ఈ లోన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్ ఎంతో తెలుసా?
Gold Loan
Nikhil
|

Updated on: Feb 07, 2023 | 12:58 PM

Share

భారతదేశంలో బంగారం వాడకం ఎక్కువగా ఉంటుంది. బంగారాన్ని కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా ఆభరణాలుగా వాడడంతో డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. అయితే ఈ విషయాన్ని గమనించిన బ్యాంకులు ఆభరణాలుగా చేయించుకున్న బంగారాన్ని ష్యూరిటీగా పెట్టుకుని లోన్లు ఇస్తుంటాయి. గోల్డ్ లోన్లు అంటూ ఇచ్చే లోన్లు సామాన్యులు ఎక్కువగా తీసుకుంటారు. తమ అవసరాన్ని తీర్చే ఈ లోన్లకు ఆదరణ ఎక్కువే. ముఖ్యంగా రైతులు ఈ లోన్లను ఎక్కువగా తీసుకుంటారు. అలాగే వ్యాపారం చేయాలనుకునే వారితో, మరింత వృద్ధిలోకి తీసుకురావాలనుకును వారు ఈ లోన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే వీటిల్లో అందరూ చూసే మొదటి సమస్య వడ్డీ. ఇండియాలో ఉన్న ఇన్ని బ్యాంకుల్లో ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి బంగారాన్నికుదువ పెట్టుకుని లోన్ ఇస్తుందనే విషయంపై ఎక్కువగా సగటు సామాన్యుడు దృష్టి పెడుతుంటాడు. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్ విషయంలో ఏ బ్యాంకు తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుందో? అని వెతుకుతుంటాం. ప్రస్తుతం గోల్డ్ లోన్ ఏ బ్యాంకు తక్కువ వడ్డీకు రుణం ఇస్తుందో? ఓ సారి చూద్దాం.

బంగారు రుణం తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు

ముఖ్యంగా బంగారు రుణం మంజూరు చేయడానికి బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ను తనిఖీ చేస్తాయి. మీరు గతంలో రుణం తీసుకుని దాని ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోతే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపిస్తుంది. గోల్డ్ లోన్ తీసుకునే ముందు మన క్రెడిట్ స్కోర్ సక్రమంగా ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు ఓ రూ.5 లక్షలు రుణం తీసుకుంటే ఏ బ్యాంకు ఎంత మేరు వడ్డీ వేస్తుందో చూద్దాం. యూనియన్ బ్యాంకు 8.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ 8.45 శాతం, ఎస్ బీఐ 8.55 శాతం, కెనరా బ్యాంక్ 9.55 శాతం, కరూర్ బ్యాంక్ వైశ్య బ్యాంక్ 9.70 శాతం, యాక్సిస్ బ్యాంక్ ఏకంగా 17 శాతం వడ్డీని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. అలాగే ఎన్ బీఎఫ్ సీలైన బజాన్ ఫిన్ సెర్వ్ 9.50 శాతం, మణప్పురం 9.90 శాతం, అలాగే మూత్తూట్ ఫైనాన్స్ 12.00 శాతం వడ్డీను వసూలు చేస్తాయి. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునే విషయంలో ఏ బ్యాంకు తక్కువ వడ్డీ వసూలు చేస్తుందో? చూసుకుని బంగారాన్ని కుదువ పెట్టుకుని డబ్బులు తీసుకోవడం ఉత్తమం.