Odysse Electric scooter: తక్కువ ధర.. అధిక సామర్థ్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్.. చిరు వ్యాపారులకు చక్కని ఎంపిక..
అందులో భాగంగానే ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తమ కొత్త స్కూటర్ ని ఆవిష్కరించింది. సిటీ పరిధిలో ఇంటి అవసరాలకు బాగా ఉపయోగపడే ఈ స్కూటర్ ఫీచర్లు, ధర తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం..

వినియోగదారుల ఆలోచనలు మారిపోతున్నాయి. వారి అవసరాలకు అనుగుణంగా వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు సిటీ పరిధిలో తిరిగేందుకు అనువైన వాహనాలను కొనుగోలుచేస్తున్నారు. మరికొందరూ స్పోర్ట్స్ తరహా, ఇంకొందరు చిరు వ్యాపారులు వారి వ్యాపార అవసరాలకు అనుగుణంగా వాహనాలను తీసుకుంటున్నారు. వినియోగదారుని అవసరాలను ఆధారంగా చేసుకొనే ఇప్పుడు వాహన తయారీదారులు తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నారు. ఎక్కువగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుండటంతో ఆ వేరియంట్లోనే వారి అవసరాలకు అనుగుణంగా కంపెనీలు ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశ పెడుతున్నారు. అందులో భాగంగానే ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తమ కొత్త స్కూటర్ ని ఆవిష్కరించింది. సిటీ పరిధిలో ఇంటి అవసరాలకు బాగా ఉపయోగపడే ఈ స్కూటర్ ఫీచర్లు, ధర తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం..
250 కేజీల బరువును కూడా..
ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఒడిస్సీ ట్రాట్ పేరిట ఓ స్కూటర్ ను లాంచ్ చేసింది. ఇది దాదాపు 250 కేజీల బరువు సైతం అలవోకగా తరలించగలుగుతుంది. ఇది పసుపు, బ్లాక్, రెడ్, మరూన్ వంటి నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తోంది. దీనిలో అత్యాధునిక ఫీచర్లైన స్మార్ట్ బీఎంఎస్, ఎల్ఈడీ ఓడో మీటర్, ఐఓటీ ఏనేబుల్ ట్రాకింగ్, జీయో ఫెన్సింగ్, ఇమ్మోబైలైజేషన్ వంటివి ఉన్నాయి. కంపెనీ ఈ స్కూటర్ కు మూడు సంవత్సరాల వారంటీని ఇస్తోంది. అలాగే దానిలో పవర్ సామగ్రికి ఒక ఏడాది వారంటీని అందిస్తోంది.
సామర్థ్యం ఇలా..
ఈ స్కూటర్ లో 250 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలుతుంది. దీనిలో 60v 32Ah వాటర్ ప్రూఫ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 75 కిలోమీటర్లు మైలేజీ వస్తుంది. దీనిలో ని బ్యాటరీ రెండుగంటల్లోనే సున్నా నుంచి 60 శాతం చార్జ్ అవుతుంది. అలాగే 0 నుంచి 100 శాతం చార్జ్ అవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది.



ధర ఎంతంటే..
గ్యాస్ సిలెండర్లు, బరువైన హార్డ్ వేర్ సామగ్రి, వాటర్ కేన్లు, గ్రోసరీస్, వంటి రోజూ వారి అవసరాలకు ఈ బైక్ బాగా ఉపయోగపడుతుంది. చిరు వ్యాపారులకు, డెలివరీ బాయ్స్ కి ఈ స్కూటర్ బెస్ట్ ఎంపిక. దీని ప్రారంభ ధర రూ. 99,999(ఎక్స్ షోరూం, ముంబై)గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




