AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump effect: ట్రంప్ దెబ్బతో ఆ రంగాలకు గడ్డు కాలం.. పెట్టుబడి పెడితే ఇక అంతే..!

భవిష్యత్తు అవసరాలు, ఆర్థిక భరోసా కోసం ప్రతి ఒక్కరూ వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలంలో వాటి నుంచి అధిక సంపద వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవారు విపరీతంగా పెరిగారు. వాటిలో ఎస్ఐపీ (సిప్) విధానంలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంధ్యం భయాలు ఎక్కువైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఐటీ, మెటల్స్ రంగాల్లో పెట్టుబడులను నివారించాలని, వీటికి బదులుగా ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఫైనాన్స్ లలో పెట్టుబడులను విస్తరించాలని సూచిస్తున్నారు.

Trump effect: ట్రంప్ దెబ్బతో ఆ రంగాలకు గడ్డు కాలం.. పెట్టుబడి పెడితే ఇక అంతే..!
Trump Tariffs
Nikhil
|

Updated on: Apr 06, 2025 | 3:00 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు విధించారు. దీనిలో భాగంగా మన దేశం నుంచి వెళ్లే వాటిపై 27 శాతం చెల్లించాలి. ఏప్రిల్ 9 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీని తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి పడిపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, మెటల్ రంగాలకు పెట్టుబడి దారులు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ట్రంప్ చర్యల నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐటీ, మెటల్ తదితర రంగాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ రంగాలు ఒడిదొడుకులకు లోనుకావొచ్చని వారి అభిప్రాయం. వాటికి బదులుగా ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఫైనాన్స్ రంగాలలో ఇన్వెస్ట్ మెంట్ మంచిదని చెబుతున్నారు.

అమెరికా ఊహించిన దానికంటే ఎక్కువగా సుంకాలు విధించిందని ఆర్థిక వేత్తల వాదన. దీని వల్ల ఐటీ, లోహాలు వంటి రంగాల నెమ్మదించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనను సూచిస్తుంది. అలాగే ఇతర దేశాలు కూడా ప్రతీకార వాణిజ్య చర్యలకు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కారణాలతో పెట్టుబడిదారులు అన్ని విషయాలను నిశితంగా గమనించాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపు తర్వాత భారతీయ మార్కెట్లు గందరగోళానికి గురై, దాదాపు ఒకటిన్నర శాతం క్షీణించాయి. నిఫ్టీ రెండు రోజుల పాటు తన కీలక మద్దతు స్థాయి 23,100 కంటే తక్కువకు పడిపోయి, 22,904.45 వద్ద స్థిరపడింది. చాలా రంగాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.

ఫార్మా రంగాన్ని ఇప్పటి వరకు సుంకాల నుంచి మినహాయించారు. అయితే ఇంతకు ముందు చూడని స్థాయిలో ఫార్మా రావడం ప్రారంభమవుతుందని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా సుంకాల ప్రకటన తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి పడిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత చైనా కూడా ప్రతీకార చర్యలు తీసుకుంది. అమెరికా దిగుమతులపై 34 శాతం సుంకాన్ని విధించింది. ఏప్రిల్ 10 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!