RBI: రిటైల్‌ రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరిక..

RBI: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ గురించి బ్యాంకులను హెచ్చరించిన తర్వాత, ప్రస్తుతం రిటైల్‌ రుణాల విషయంలో కూడా బ్యాంకుల తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. రిటైల్ రుణాలు ఇవ్వడంపై బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటం మొత్తం వ్యవస్థకు ఇబ్బందులను

RBI: రిటైల్‌ రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరిక..
RBI
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 29, 2022 | 11:24 AM

RBI: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ గురించి బ్యాంకులను హెచ్చరించిన తర్వాత, ప్రస్తుతం రిటైల్‌ రుణాల విషయంలో కూడా బ్యాంకుల తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. రిటైల్ రుణాలు ఇవ్వడంపై బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటం మొత్తం వ్యవస్థకు ఇబ్బందులను సృష్టిస్తుందని ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది. బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఎక్కువుగా రిటైల్‌ రుణాలపై దృష్టి పెట్టడం బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరించింది. ఈ రుణాల వసూళ్లలో ఏ మాత్రం తేడా వచ్చినా బ్యాకింగ్ రంగం పెను ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కార్పొరేట్‌ రుణ వసూళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులతో దేశీయ బ్యాంకులు ఇటీవల గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వంటి రిటైల్‌ రుణాలపై దృష్టి పెట్టాయి. ఈ రుణాల వినియోగాన్ని చివరి వరకు పర్యవేక్షించే అవకాశం ఉండడంతో వీటిపై ఆసక్తి చూపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం. కార్పొరేట్‌ రుణాలకు సరైన గిరాకీ లేకపోవడమేనని తెలుస్తోంది. దీంతో దేశీయ బ్యాంకుల రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా ప్రస్తుతం 45 శాతం మించిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ హెచ్చరికలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక మాంద్యంపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. రిటైల్ రుణాలు ఎక్కువుగా ఇవ్వడం దేశీయ బ్యాంకుల భవిష్యత్తుకు ఏ మాత్రం మంచివి కావని స్పష్టం చేసింది. పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం మన బ్యాంకుల ఆస్తుల నాణ్యతతో పాటు లాభాలనూ దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొవిడ్‌ మహమ్మారి వంటి విపత్తులను విజయవంతంగా ఎదుర్కొని మొండి బకాయిలు తగ్గించుకున్న బ్యాంకింగ్‌ రంగానికి ఈ పరిణామాలు పెద్ద సవాల్‌ అని తెలిపింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న ద్రవ్య విధానాలూ, మన బ్యాంకులకు అందే నిధుల సరఫరాని దెబ్బతిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

చాలా కాలంగా బ్యాంకులకు లాభదాయకంగా పరిగణించబడుతున్న రిటైల్ రుణాలు మొత్తం వ్యవస్థకు పూర్తి ప్రమాదాన్ని కలిగిస్తాయని పేర్కొంది. అయితే మొత్తం వ్యవస్థకు ఏదైనా ప్రమాదం తలెత్తినప్పటికీ, దాని విధానాల ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆ సమస్యను పూర్తిగా ఎదుర్కోగలదని కూడా తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..