AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio TV+: టీవీ చూడ్డానికి సెటప్‌ బాక్స్‌ అవసరం లేదు.. జియో నుంచి కొత్త సేవలు

అయితే ఇకపై జీయోటీవీ+ యాప్ సేవలను పొందడానికి సెటప్‌ బాక్స్‌ అవసరమే ఉండదు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌, అమెజాన్‌ ఫైర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే టీవీల్లో జియో టీవీ+ సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ జియో నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. దీంతో 800 డిజిటల్ ఛానెల్స్‌ను వీక్షించే అవకాశం లభిస్తుంది...

Jio TV+: టీవీ చూడ్డానికి సెటప్‌ బాక్స్‌ అవసరం లేదు.. జియో నుంచి కొత్త సేవలు
Jio Tv+
Narender Vaitla
|

Updated on: Aug 21, 2024 | 6:59 AM

Share

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో.. టీవీ సేవలను క్రమంగా విస్తరిస్తోంది. కేవలం టెలికాంకు మాత్రమే పరిమితం కాకుండా టీవీ విభాగంలోనూ ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జియో సెట్‌ టాప్‌ బాక్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జియో ఫైబర్‌, ఎయిర్‌ ఫైబర్‌ కనెన్లు తీసుకున్న వారికి సెటప్‌బాక్స్‌లో జీయో టీవీ+ యాప్స్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఇకపై జీయోటీవీ+ యాప్ సేవలను పొందడానికి సెటప్‌ బాక్స్‌ అవసరమే ఉండదు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌, అమెజాన్‌ ఫైర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే టీవీల్లో జియో టీవీ+ సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ జియో నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. దీంతో 800 డిజిటల్ ఛానెల్స్‌ను వీక్షించే అవకాశం లభిస్తుంది.

అన్ని స్మార్ట్‌టీవలో జియో టీవీ+ యాప్‌ అందుబాటులోకి రానుంది. కేవలం ఛానల్స్‌ మాత్రమే కాకుండా ఈ యాప్‌లో జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5 వంటి ఓటీటీ యాప్స్‌ను కూడా వినియోగించొచ్చు. అయితే ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్‌ సబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రేక్షకులు క్వాలిటీతో కూడిన కంటెంట్‌ను వీక్షించే అవకాశం లభిస్తుంది.

జియో ఎయిర్‌ ఫైబర్‌ ఉపయోగించే వారు అన్ని ప్లాన్లపైనా, జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్ ఉపయోగించే వారు రూ. 599, రూ. 899 ఆపై ప్లాన్లు తీసుకున్న వారు ఈ యాప్‌లో లాగిన్‌ అయ్యి కంటెంట్‌ వీక్షించవచ్చు. జియో ఫైబర్‌ ప్రీపెయిడ్‌ యూజర్లు అయితే రూ.999 లేదా అంతకంటే ఆపై ప్లాన్లు తీసుకొని ఉండాలి. అయితే సామ్‌సంగ్‌ టీవీ యూజర్లు ఈ యాప్‌ను ఉపయోగించుకునే అవకాశం లేదు. వీళ్లు కచ్చితంగా సెటప్‌ బాక్స్‌ను ప్రత్యేకంగా తీసుకోవాల్సిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..