AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio New Plan: రిలయన్స్ జియో అదిరిపోయే ప్లాన్.. కేవలం రూ.55తో రీఛార్జ్ చేసుకుంటే 150 ఛానల్స్ ఫ్రీ..

రిలయన్స్ జియో తమ కస్టమర్లకు మరో శుభవార్త అందించింది. రూ.55 జియో ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే 150కిపైగా ప్రీమియం ఛానళ్లను చూడవచ్చు. జియో టీవీలో జియో నెంబర్‌తో లాగిన్ అయ్యి ఛానళ్లు వీక్షించవచ్చు. మరిన్ని వివరాలు చూస్తే..

Jio New Plan: రిలయన్స్ జియో అదిరిపోయే ప్లాన్.. కేవలం రూ.55తో రీఛార్జ్ చేసుకుంటే 150 ఛానల్స్ ఫ్రీ..
Jio
Venkatrao Lella
|

Updated on: Jul 08, 2026 | 6:38 PM

Share

రిలయన్స్ జియో వినియోగదారుల కోసం అత్యంత సరసమైన ధరలో రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్ ప్రవేశపెట్టింది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్-ఓన్లీ రీఛార్జ్ ద్వారా వినియోగదారులు జియోటీవీ మొబైల్ యాప్‌లో 30 రోజుల పాటు 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లు, వాటిలో 150కు పైగా ప్రీమియం ఛానళ్లను వీక్షించే అవకాశముంది. సరసమైన ధరలో అంతరాయం లేని వినోదాన్ని కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించిన ఈ కొత్త ప్యాక్‌లో 16కుపైగా భాషల్లో జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాలు, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, లైఫ్‌స్టైల్, ప్రాంతీయ కార్యక్రమాలు వంటి విభిన్న విభాగాలకు చెందిన విస్తృత కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్‌లో జియోస్టార్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ ప్రసార సంస్థల ప్రీమియం ఛానళ్లు ఉన్నాయి. స్టార్‌ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ హెచ్‌డీ, సోనీ ఎస్‌ఏబీ హెచ్‌డీ, డిస్కవరీ, అనిమల్ ప్లానెట్‌తో పాటు సన్ టీవీ నెట్‌వర్క్, ఈటీవీకు చెందిన ప్రముఖ ప్రాంతీయ ఛానళ్లు కూడా ఈ ప్యాక్‌లో లభిస్తాయి.

వినియోగదారులు రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్‌తో రీఛార్జ్ చేయాలి. జియోటీవీ యాప్‌ను తెరిచి తమ జియో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే వెంటనే లైవ్ టీవీని వీక్షించవచ్చు. అదనంగా ఎలాంటి యాక్టివేషన్ ప్రక్రియ అవసరం లేదు. రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్ కేవలం వినోద సేవల కోసం మాత్రమే. ఇందులో వాయిస్ కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఈ సేవను వినియోగించడానికి యాక్టివ్ జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్ తప్పనిసరి. జియోటీవీ యాప్ ద్వారా ఒక మొబైల్ పరికరంలో ఈ సేవను వినియోగించవచ్చు. ఈ ప్యాక్ జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. వినియోగదారులు ముందుగానే పలుమార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి ప్యాక్ గడువు ముగిసిన తర్వాత తదుపరి ప్యాక్ స్వయంచాలకంగా అమల్లోకి వస్తుంది. రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్ ప్రస్తుతం మైజియో యాప్, జియో వెబ్‌సైట్తో పాటు అన్ని అధీకృత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ జియో రీఛార్జ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంది.

Follow Us